సేలం: బాలికను గర్భవతిని చేసిన బాలుడిపై పోలీసులు పోక్సో కేసు నమోదు చేశారు. ఈరోడ్ జిల్లా గోపిచెట్టిపాళయంకు చెందిన 15 ఏళ్ల బాలికకు ఇటీవల తరచూ కడుపునొప్పి వస్తుండడంతో ఆమె తల్లి తిరుపూర్‌లోని ఓ ప్రైవేట్ ఆస్పత్రికి తీసుకెళ్లింది. అక్కడ బాలికకు చేసిన వైద్యపరీక్షల్లో ఆరు నెలల గర్భిణి అని వైద్యులు తెలిపారు. ఇది విని షాక్‌కు గురైన బాలిక తల్లి తన కుమార్తెను వివరాలు అడిగింది. ఆ సమయంలో బంధువు కుమారుడైన 17 ఏళ్ల బాలుడితో వివాహేతర సంబంధం పెట్టుకోవడం వల్లే గర్భం దాల్చిందని బాలిక చెప్పింది. వెంటనే బాలిక తల్లి ఘటనపై గోపిశెట్టిపాలయం మహిళా పోలీస్‌స్టేషన్‌న్‌లో ఫిర్యాదు చేసింది. పోలీసులు 17 ఏళ్ల బాలుడిపై పోక్సో చట్టం కింద కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.
కంటైనర్ ఢీకొని దంపతుల దుర్మరణం
అన్నానగర్: కంటైనర్ లారీ బైక్‌ను ఢీకొన్న ఘటనలో దంపతులు దుర్మరణం పాలయ్యా రు. ఈ ఘటన తిరువొత్తియూర్లో బుధవారం రాత్రి చోటుచేసుకుంది. చైన్నెలోని తిరువొత్తియూర్ భారతీనగర్‌కు చెందిన విజయన్ (39) చైన్నెలోని ఓ ప్రైవేట్ కంపెనీలో ఉద్యోగి. ఇతని భార్య జయరాసిత (33). వీరిద్దరూ బుధవా రం రాత్రి తిరువొత్తియూర్ నుంచి బైక్‌లో మాఽ దవరం రౌండ్ఠానాకు వెళుతున్నారు. మాధవ రం మంజంబాక్కం చిన్నరౌండ్ఠానా సమీపం వద్ద వెళుతుండగా మనలి నుంచి మాధవరం వైపు వెళుతున్న కంటైనర్ లారీ బైక్‌ను ఢీకొంది. ఈ ఘటనలో రోడ్డుపై పడ్డ వీరిపై కంటైనర్ దూసుకెళ్లింది. ఈప్రమాదంలో దంపతులు ఇద్ద రు అక్కడికక్కడే మృతిచెందారు. విషయం తె లిసి మాధవరం పోలీసులు ప్రమాదానికి కారణమైన లారీడ్రైవర్ తెన్కాశికి చెందిన మురుగన్‌ను అరెస్టు చేసి దర్యాప్తు చేస్తున్నారు.
Comments
Please login to add a commentAdd a comment