త్రిష క్రేజ్
తమిళసినిమా: నటి త్రిష క్రేజ్ మామూలుగా లేదు. ఇంకా చెప్పాలంటే అదృష్టవంతురాలు అంటే ఈమెనే అని చెప్పక తప్పదు. ఎందుకంటే త్రిషపై ప్రేమ పెళ్లి వంటి వదంతులు చాలానే వైరల్ అయ్యాయి. అయితే అవేవీ ఈమె వృత్తిపై ప్రభావం చూపకపోవడం విశేషమే. ఈమె నటిగా పరిచయమై రెండున్నర దశాబ్దాలు దాటింది. మొదట మోడలింగ్ రంగంలోకి ప్రవేశించిన ఈ బ్యూటీ అందాల పోటీల్లో చైన్నె సుందరిగా కిరీటాన్ని గెలుచుకున్నారు. అయితే సాధారణంగా మోడలింగ్ రంగం నుంచి వచ్చిన నటీమణులకు డైరెక్ట్‌గా హీరోయిన్ ఛాన్సులు వస్తుంటాయి. అయితే నటి త్రిషకు అందుకు భిన్నంగా సిమ్రాన్ కథానాయకిగా నటించిన జోడి చిత్రంలో ఆమె స్నేహితురాలుగా చిన్న పాత్రలో నటించే అవకాశం వచ్చింది. అయితే అవకాశాన్ని కూడా త్రిష సద్వినియోగం చేసుకున్నారు. అదే ఆమెను స్టార్ హీరోయిన్ చేసిందని చెప్పవచ్చు. ఆ తర్వాత సూర్యకు జంటగా నటించిన మౌ నం పేసియదే చిత్రంతో మంచి గుర్తింపు తెచ్చుకున్నారు ఆ తర్వాత విక్రమ్ సరసన నటించిన సామి, విజయ్‌తో జతకట్టిన గిల్లీ చిత్రాలు సూపర్ హిట్ కావడంతో త్రిష స్టార్ డమ్ పెరిగిపోయింది. ఆ తర్వాత ఆమెకు కెరీర్ పరంగా దానికి చూసుకోవాల్సిన అవసరం లేకపోయింది. తెలుగులోనూ ప్రభాస్ సర్జన్ నటించిన వర్షం సిద్ధార్థ్‌కు జంటగా నటించిన నువ్వు వస్తానంటే నేనొద్దంటానా వంటి చిత్రాలు మంచి విజయాన్ని సాధించాయి. దీంతో అక్కడ కూడా త్రిష స్టార్ హీరోయిన్ అయిపోయారు. అదేవిధంగా, హిందీ, కన్నడం, మలయాళం నటించిన ఈమె పాన్ ఇండియా నటిగా గుర్తింపు పొందారు అలాంటి సమయంలో నటించిన కొన్ని ఉమెన్ సెంట్రల్ కథా చిత్రాలు నిరాశ పరచడంతో ఒకసారిగా డౌన్ అయిపోయింది. అలాంటి సమయంలో మణిరత్నం దర్శకత్వంలో నటించిన పొన్నియిన్ సెల్వన్ చిత్రం త్రిషకు పూర్వ వైభవాన్ని తెచ్చిపెట్టింది. ఆ తర్వాత ఈమె సీనియర్ స్టార్ హీరోలకు ఏకై క ఆప్షన్‌గా మారారు. ఇప్పుడు తమిళం, తెలుగు, మలయాళం, కన్నడం చిత్రాల్లో నటిస్తూ బిజీగా ఉన్నారు. తమిళంలో అజిత్ సరసన ఏక కాలంలో విడాముయర్చి, గుడ్ బ్యాడ్ అగ్లీ చిత్రాల్లో నటిస్తున్నారు. అదేవిధంగా తెలుగులో చిరంజీవికి జంటగా విశ్వంభర చిత్రంలో నటిస్తున్నారు. తాజాగా ప్రభాస్‌కు జంటగా మరోసారి నటించడానికి సిద్ధం అవుతున్నట్లు తాజా సమాచారం.
Comments
Please login to add a commentAdd a comment