అన్నానగర్: కారులో అక్రమంగా తరలిస్తున్న రూ.2కోట్ల విలువచేసే ఏనుగు దంతాల బొమ్మలను స్వాధీనం చేసుకున్నారు. విల్లుపురంలోని తిరుచ్చి రోడ్డులోని హాస్టల్‌లో ఏనుగు దంతాల బొమ్మలు విక్రయిస్తున్నట్లు తమిళనాడు అటవీ, చైన్నె జోనల్ వైల్డ్‌లైఫ్ క్రైమ్ స్క్వాడ్ కార్యాలయానికి గురువారం రాత్రి పక్కా సమాచారం అందింది. అధికారులు అక్కడికి వెళ్లి చూడగా, గోనె సంచిలో ఏనుగు దంతాలతో చేసిన 4 ఏనుగు బొమ్మలు, అలంకార హారంతో మహిళ సహా 12 మంది పట్టుబడ్డారు. వీరిలో 12 మంది తంజావూరు, తిరుచ్చి, ఒట్టంఛత్రం, ధర్మపురి, సేలం ప్రాంతాలకు చెందిన వారని విచారణలో తేలింది. బొమ్మల విలువ రూ.2కోట్లు ఉంటుందని పోలీసులు తెలిపారు. కేసు దర్యాప్తు చేస్తున్నారు.
గంజాయి కేసులో 12 ఏళ్ల జైలు శిక్ష
అన్నానగర్: గంజాయి స్మగ్లింగ్ కేసులో నలుగురికి మదురై కోర్టు 12 ఏళ్ల జైలు శిక్ష విధించింది. దిండుక్కల్‌లో గంజాయి స్మగ్లింగ్‌పై పోలీసులకు గతేడాది పక్కా సమాచారం అందింది. దీంతో పోలీసులు దిండుక్కల్ గాంధీజీ పుదురోడ్డు జంక్షన్ వద్ద వాహనాల తనిఖీలు నిర్వహించారు. అటుగా వెళ్తున్న ఓ కారును తనిఖీ చేయగా అందులో 72 కిలోల గంజాయి ఉన్నట్లు గుర్తించారు. దీనికి సంబంధించి అరుణ్‌కుమార్ (48), సురేష్ (41), సేలం జిల్లా దడగప్ పట్టికి చెందిన యోగరాజ్ (24), అజిత్‌కుమార్ (26)లను దిండుక్కల్ పోలీసులు అరెస్టు చేశారు. మదురై మాదక ద్రవ్యాల కేసుల ప్రత్యేక కోర్టులో ఈ కేసు విచారణ జరిగింది. నేరం రుజువు కావడంతో ఒక్కొక్కరికి 12 ఏళ్ల జైలు శిక్ష, రూ. లక్ష జరిమానా విధిస్తూ న్యాయమూర్తి ఎ.ఎస్.హరిహరకుమార్ గురువారం తీర్పు చెప్పారు.
Comments
Please login to add a commentAdd a comment