అన్నానగర్: కుండ్రత్తూర్‌లో ఎలుకల మందు ఘూటకు ఇద్దరు చిన్నారులు మృతిచెందారు. తండ్రి, తల్లి పరిస్థితి విషమంగా ఉంది. కాంచీపురం జిల్లా కుండ్రత్తూరు సమీపంలోని దేవేంద్రన్ నగర్‌లోని ఓ ప్రైవేట్ ఫ్లాట్‌లో గిరిధరన్ (34) నివసిస్తున్నాడు. ఇతని భార్య పవిత్ర (30). వీరి కుమార్తె విశాలిని (6), కుమారుడు సాయిసుదర్శన్ (1). గురువారం ఉదయం ఈ నలుగురూ వాంతులు, కడుపునొప్పితో బాధపడుతున్నారు. దీంతో స్థానికులు నలుగురిని కోవూరులోని ఓ ప్రైవేట్ ఆస్పత్రికి తరలించారు. అక్కడ చికిత్స పొందుతూ విశాలిని, సాయిసుదర్శన్ ఇద్దరూ మృతిచెందారు. గిరిధరన్, పవిత్ర ఇద్దరిని పోరూరులోని ఓ ప్రైవేట్ ఆస్పత్రిలో చేర్పించారు. దీనిపై కుండ్రత్తూర్ పోలీసులకు సమాచారం అందించారు. చిన్నారుల మృతదేహాలను పోలీసులు పోస్టుమార్టం నిమిత్తం క్రోంపేట ప్రభుత్వాస్పత్రికి తరలించారు. పోలీసుల విచారణలో ఇంట్లో ఎలుకలు ఎక్కువగా ఉండడంతో మందు పిచికారీ చేసిన కంపెనీని సంప్రదించి ఆన్‌లైన్‌లో మాట్లాడాడు. ఇద్దరు ఉద్యోగులు ఇంటికి కొచ్చి ఇళ్లంతా పిచికారీ చేసి వెళ్లిపోయారు. రాత్రి నలుగురు ఇంట్లో నిద్రిస్తుండగా ఘాటుకు వాంతులతో స్పృహతప్పి పడిపోయారు. ఎలుకల మందు ఎక్కువగా వేయడంతో పిల్లలిద్దరూ మృతిచెందారని, భార్యాభర్తలు ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారని తెలిసింది. అనంతరం టీ.నగర్‌కు చెందిన కంపెనీపై కేసు నమోదు చేసిన కుండ్రత్తూర్ పోలీసులు ఎలుకల మందును ఇంట్లో వదిలేసిన ఉద్యోగి దినకరణ్ (29)ను అరెస్టు చేశారు. కంపెనీ యజమాని ప్రేమ్‌కుమార్, మరో ఉద్యోగి కోసం గాలిస్తున్నారు.
Comments
Please login to add a commentAdd a comment