గర్భిణులకు పౌష్టికాహారం అవసరం
పళ్లిపట్టు: గర్భిణులకు పౌష్టికాహారం అవసరమని ఎమ్మెల్యే చంద్రన్ తెలిపారు. పళ్లిపట్టు సమీపం అత్తిమాంజేరిపేటలోని అంగన్‌వాడీ కేంద్రంలో గర్భిణులు, బాలింతలకు పౌష్టికాహార కిట్లు పంపిణీ కార్యక్రమం శుక్రవారం నిర్వహించారు. మండల చిన్నారుల సంరక్షణ అధికారి డానియా అధ్యక్షత వహించారు. ముఖ్య అతిథిగా తిరుత్తణి ఎమ్మెల్యే చంద్రన్ పాల్గొని గర్భిణులు, బాలింతలకు ప్రభుత్వ పౌష్టికాహార కిట్లు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ... గర్భం దాల్చిన ప్రతి ఒక్కరూ తప్పనిసరిగా పౌష్టికాహారం తీసుకోవాలని తెలిపారు. క్రమం తప్పకుండా ప్రతినెలా సమీపంలోని ప్రభుత్వ ఆరోగ్య కేంద్రాలు, ఆసుపత్రులకు వెళ్లి పరీక్షలు చేయించుకోవాలన్నారు. ఆరోగ్యకరమైన శిశువుకు జన్మనిచ్చేందుకు గర్భిణులు పౌష్టికాహారం తీసుకోవాలని కోరారు. బీడీఓ మిల్కా రాజాసింగ్, యూనియన్ డీఎంకే కార్యదర్శి చంద్రన్, యూనియన్ వైస్ భారతి సహా అనేక మంది పాల్గొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment