హత్యాయత్నం కేసులో 8 మంది అరెస్టు | - | Sakshi
Sakshi News home page

హత్యాయత్నం కేసులో 8 మంది అరెస్టు

Published Sat, Nov 16 2024 8:25 AM | Last Updated on Sat, Nov 16 2024 8:25 AM

-

తిరువొత్తియూరు: చైన్నె ఎన్నూరు సత్యవాణి ముత్తునగర్‌కు చెందిన సంతోష్‌(33)పై రౌడీషీట్‌ ఉంది. అతనిపై హత్యాయత్నంతో సహా 7 కేసులు నమోదై ఉన్నాయి. ఈ క్రమంలో అదే ప్రాంతం ఇందిరానగర్‌ చెందిన మరొక రౌడీ సూర్య అనే వ్యక్తితో సంతోష్‌కు గొడవలు ఉన్నాయి. దీని కారణంగా గత 11వ తేదీ ఇంటిలో ఉన్న సంతోష్‌పై గుర్తు తెలియని వ్యక్తులు కత్తులతో దాడి చేసి పారిపోయారు. దీంతో తీవ్ర గాయాలపాలైన సంతోష్‌ను స్టాన్లీ ప్రభుత్వ ఆసుపత్రిలో చేర్చారు. అక్కడ చికిత్స పొందుతున్నాడు. దీనికి సంబంధించి రౌడీ సూర్య, లోకేష్‌తో సహా 8 మందిని పోలీసులు అరెస్టు చేశారు.

హత్య కేసులో

నిందితుడి తల్లి అరెస్టు

అన్నానగర్‌: చైన్నె ఆజాద్‌నగర్‌ రాజగోపాల్‌ వీధిలో నివసించే తమీమ్‌ అన్సారీ (47) ఆటో నడుపుతూ రియల్‌ ఎస్టేట్‌ వ్యాపారం చేస్తున్నాడు. శుక్రవారం సాయంత్రం 4.30 గంటల ప్రాంతంలో ఎదురింట్లో నివశించే మహ్మద్‌ ముక్తార్‌తో అతనికి గొడవ జరిగింది. తమీమ్‌ అన్సారీ ఇంటి ముందు నీళ్లు పోసి కడిగాడు. ఇది మహమ్మద్‌ ముక్తార్‌కి నచ్చలేదు. తమీమ్‌ అన్సారీ వద్దకు వెళ్లి గొడవకు దిగాడు. అది ఘర్షణగా మారింది. దీంతో ఆగ్రహించిన మహ్మద్‌ ముక్తార్‌ ఇంట్లో నుంచి కత్తి తీసి తమీమ్‌ అన్సారీ మెడపై పొడిచాడు. ఇందులో తమీమ్‌ అన్సారీ తీవ్రంగా గాయపడ్డాడు. రక్తపు మడుగులో పడి మృతి చెందాడు. మహ్మద్‌ ముక్తార్‌ అన్నానగర్‌ పోలీస్‌ స్టేషన్‌లో లొంగిపోయాడు. దీంతో పోలీసులు అతడిపై హత్యానేరం కింద కేసు నమోదు చేసి అరెస్ట్‌ చేసి కోర్టులో హాజరుపరిచి జైలుకు తరలించారు. అయితే తమీమ్‌ అన్సారీ హత్యకు ప్రేరేపించిన మహ్మద్‌ ముక్తార్‌ తల్లి రష్యా బేగం(65)ని అరెస్ట్‌ చేయాలని 300 మందికి పైగా 11వ తేదీన అమందైకరై పోలీస్‌ స్టేషన్‌ను ముట్టడించారు. అనంతరం డిప్యూటీ కమిషనర్‌ వారితో మాట్లాడి పంపించారు. ఈ స్థితిలో శుక్రవారం ఆటోడ్రైవర్‌ హత్య కేసుకు సంబంధించి నిందితుడి తల్లి రష్యా బేగంను పోలీసులు అరెస్ట్‌ చేశారు. అనంతరం అమెను కోర్టులో హాజరుపరిచి జైలుకు తరలించారు.

న్యాయవాద సంస్థకు

బాంబు బెదిరింపు

కొరుక్కుపేట: చైన్నెలో ప్రైవేట్‌ లాయర్ల బాంబు బెదిరింపు ఘటన కలకలం రేపింది. చైన్నెలోని రాధాకృష్ణన్‌ రోడ్‌లో ప్రైవేట్‌ లాయర్ల సంస్థ పనిచేస్తోంది. గురువారం కంపెనీ ముంబయి కార్యాలయానికి ఒక ఈ మెయిల్‌ వచ్చింది. చైన్నె కార్యాలయంలో పేలుడు పదార్థాలు ఉన్నట్లు తెలిపారు. దీనిపై మైలాపూర్‌ పోలీసులకు సమాచారం అందించారు. ఆ తర్వాత చైన్నెలోని న్యాయవాద సంస్థని పోలీసులు వచ్చి తనిఖీ చేయగా బాంబు బెదిరింపు నకిలీదని తేలింది. ఇటీవలి కాలంలో ప్రభుత్వ ఆసుపత్రులు, కళాశాలలు, ప్రైవేట్‌ సంస్థలకు బాంబు బెదిరింపులు రావడం గమనార్హం.

ప్రభుత్వ వేడుకల్లో

మా పేర్లు ఏవీ?

వీసీకే, కమ్యూనిస్టు ఎమ్మెల్యేలు గగ్గోలు

సేలం: ప్రభుత్వ వేడుకల పత్రికల్లో తమ పేర్లు ఉండడం లేదని వీసీకే, కమ్యూనిస్టు ఎమ్మెల్యేలు గగ్గోలు పెడుతున్నారు. నాగై జిల్లాలో మంత్రి అన్బిల్‌ మహేష్‌ పాల్గొన్న ప్రభుత్వ కార్యక్రమం శుక్రవారం జరిగింది. ఈ వేడుకలో వీసీకే ఎమ్మెల్యే ఆలూర్‌ షా నవాజ్‌, మార్కిస్ట్‌ కమ్యూనిస్టు ఎమ్మెల్యే నాగై మాలీ పాల్గొన్నారు. ఆలూర్‌ షా నవాజ్‌ మాట్లాడుతూ తాము డీఎంకేలో కూటమిలో ఉన్నామని, అయినప్పటికీ ప్రభుత్వ కార్యక్రమాల ఆహ్వాన పత్రికల్లో తమ పేర్లు ఉండడం లేదని, అయినా తాము కార్యక్రమాలలో పాల్గొంటున్నామన్నారు. తమ ఆవేదనను మాత్రమే వ్యక్తం చేస్తున్నామని తెలిపారు. ఎమ్మెల్యే నాగై మాలీ కూడా అదే ఆవేదనను వ్యక్తం చేశారు.

No comments yet. Be the first to comment!
Add a comment

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement