క్లుప్తంగా | - | Sakshi
Sakshi News home page

క్లుప్తంగా

Published Sat, Nov 16 2024 8:25 AM | Last Updated on Sat, Nov 16 2024 8:25 AM

-

బాలికపై లైంగిక దాడి

తిరువొత్తియూరు: చైన్నెలోని కీల్పాక్కం పుల్లాపురం ప్రాంతానికి చెందిన జాన్‌పాల్‌ అదే ప్రాంతంలో రోడ్డు పక్కన బిర్యానీ దుకాణం నడుపుతున్నాడు. జాన్‌పాల్‌ ఇంటిలో ఒంటరిగా ఉన్న తన దుకాణంలోని పని చేస్తున్న కార్మికుడి చెల్లైలెన 13 ఏళ్ల బాలికపై అనేకసార్లు బెదిరించి లైంగిక దాడికి పాల్పడ్డాడు. దానిని ఫోన్‌లో వీడియో రికార్డు చేసి ఏం జరిగిందో బయటపెడితే సామాజిక మాధ్యమాల్లో పెడుతానని బెదిరించాడు. ఈ క్రమంలో బాలిక ఆరోగ్యం దెబ్బతింది. దీంతో బాలిక తల్లిదండ్రులు ఆమెను కీల్పాక్కం ప్రభుత్వాసుపత్రిలో చికిత్సకు తీసుకుని వెళ్లారు. దీనిపై ఫిర్యాదు మేరకు కీల్పాకం పోలీసులు కేసు నమోదు చేసి, జాన్‌పాల్‌ను అరెస్ట్‌ చేశారు.

వృద్ధుడి ఆత్మహత్య

తిరువొత్తియూరు: పోరూరు పక్కనే ఉన్న అయ్యప్పన్‌ తంగల్‌ బస్టాండ్‌ సమీపంలోని అపార్ట్‌మెంట్‌లోని 13వ అంతస్తులో శివకుమార్‌(74) అనే వ్యక్తి నివశిస్తున్నాడు. అతని భార్య గోదై. వీరి ఇద్దరు కుమారులు విదేశాల్లో ఉంటున్నారు. దీంతో భార్యాభర్తలు మాత్రమే ఇంట్లో ఒంటరిగా ఉన్నారు. ఈ స్థితిలో శుక్రవారం ఉదయం 6 గంటల సమయంలో 13వ అంతస్తులోని ఇంటి బాల్కనీలో శివకుమార్‌ హఠాత్తుగా కిందకు దూకాడు. తీవ్రంగా గాయపడిన శివకుమార్‌ అక్కడికక్కడే మృతి చెందాడు. భర్త శివకుమార్‌ కిందకు దూకి ఆత్మహత్య చేసుకోవడంతో భార్య గోదై దిగ్భ్రాంతి చెందారు. శివకుమార్‌ గత కొన్ని నెలలుగా ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నాడు. దీంతో మానసిక వేదనకు గురై ఆత్మహత్యకు పాల్పడి ఉండవచ్చని భావిస్తున్నారు. పోరూరు పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

నిప్పంటించుకుని

యువకుడు బలవన్మరణం

తిరువొత్తియూరు: అశోక్‌ నగర్‌ పుదూర్‌ ప్రభుత్వ హయ్యర్‌ సెకండరీ రపాఠశాల ఆవరణలో అర్ధరాత్రి ఓ యువకుడు అకస్మాత్తుగా నిప్పంటించుకుని ఆత్మహత్య చేసుకున్నాడు. ఈ ఘటన కలకలం రేపింది. ఆత్మహత్యకు పాల్పడిన యువకుడిపై అశోక్‌ నగర్‌ పోలీసులు కేసు నమోదు చేసి, తీవ్రంగా విచారణ చేపట్టారు. ఆత్మహత్య చేసుకున్న యువకుడు అదే ప్రాంతానికి చెందిన అన్బు కుమారుడు చంద్రు(20) అని తెలిసింది. నందనం కళాశాలలో చదువుతున్న చంద్రు చదువును మధ్యలోనే వదిలేసి శివ భక్తుడయ్యాడు. శివాలయాల్లో డప్పు కొట్టే పని కొనసాగించాడు. పనిలేకుండా తిరుగుతున్న అతడిని తల్లి అలమేలు మంగై మందలించినట్లు తెలుస్తోంది. దీంతో మనస్తాపానికి గురైన చంద్రు పాఠశాల ఆవరణలోకి వెళ్లి నిప్పంటించుకున్నట్లు వెల్లడించారు. అతని ఆత్మహత్య నిర్ణయానికి మరేదైనా కారణం ఉందా అని పోలీసులు విచారణ జరుపుతున్నారు.

ప్రేయసిపై కక్షతో

చిన్నారి హత్య

సేలం: ప్రియురాలిపై కక్ష తీర్చుకోవడం కోసం ఆమె ఆరేళ్ల చిన్నారి గొంతు నులిమి హత్య చేసిన యువకుడిని పోలీసులు అరెస్టు చేశారు. తిరుపూర్‌ జిల్లా పల్లడం సమీపంలో కారనాంపేట నూలు కర్మాగారం ఉంది. ఈ ప్రాంతంలో 300 మందికి పైగా ఉత్తరాది వారు నివశిస్తూ పని చేస్తున్నారు. ఈ కర్మాగారంలో ఒడిశాకు చెందిన కందుదాస్‌ (31) సూపర్‌వైజర్‌గా పని చేస్తున్నాడు. గతంలోనే రెండు వివాహాలు చేసుకుని ఉన్న ఒడిశాకు చెందిన అనిత తన కుమారుడు గణేష్‌(6)తో ఒంటరిగా ఉంటూ నూలు కర్మాగారంలో పని చేస్తోంది. కందుదాస్‌కు అనితతో పరిచయం ఏర్పడి అక్రమ సంబంధంగా మారింది. ఈ క్రమంలో ఆమెకు ఇటీవల అదే కర్మాగారంలో పని చేస్తున్న సురేష్‌ అనే మరో కార్మికుడితో అక్రమ సంబంధం కలిగినట్టు తెలుస్తోంది. ఈ విషయంపై అనితకు కందుదాస్‌కు మధ్య గొడవ ఏర్పడింది. ఒక రోజు మద్యం మత్తులో కంపెనీకి వచ్చిన కందుదాస్‌ అనితతో గొడవ పెట్టుకున్నాడు. దీంతో అతనిని కంపెనీ యాజమాన్యం పని నుంచి తొలగించేసింది. ఆగ్రహించిన కందుదాస్‌ ఇంటిలో ఒంటరిగా ఉన్న అనిత కొడుకు గణేష్‌ను బయటకు తీసుకువచ్చి గొంతు నులిమి హత్య చేశాడు. కుమారుడు కనిపించకపోవడంతో అనిత ఇచ్చిన ఫిర్యాదు మేరకు పోలీసులు గాలించారు. అక్కడికి సమీపంలో ముళ్లపొదల్లో గణేష్‌ మృత దేహం కనిపించింది. పోలీసులు చిన్నారి మృత దేహాన్ని స్వాధీనం చేసుకుని శవపంచనామా నిమిత్తం ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. చిన్నారిని కందుదాస్‌ హత్య చేసినట్టు సందేహించిన పోలీసులు అతన్ని శుక్రవారం అరెస్టు చేశారు.

ట్రిప్లికేన్‌లో అర్ధరాత్రి చోరీ

కొరుక్కుపేట: చైన్నె ట్రిప్లికేన్‌లోని ఎస్‌బీఐ బ్యాంక్‌ లో అర్ధరాత్రి తలుపులు పగలగొట్టి చోరీ చేసిన ఘటన కలకలం రేపింది. శుక్రవారం బ్యాంక్‌ ఓపెన్‌ చేసేందుకు వెళ్లగా సిబ్బంది ఒక్కసారిగా షాక్‌కు గురయ్యారు. లోపలికి వెళ్లే సరికి పలు డాక్యుమెంట్లు చెల్లాచెదురుగా పడి ఉన్నాయి. దీంతో, బ్యాంక్‌ కార్యాలయం ఎదురుగా ఉన్న ట్రిప్లికేన్‌ క్రైమ్‌ బ్రాంచ్‌లో ఫిర్యాదు చేశారు. దాని ప్రకారం పోలీసు ఫోరెన్సిక్‌ విభాగం, కుక్కల పంజాతో సెల్‌లోకి వెళ్లి వేలిముద్రలు నమోదు చేసి విచారణ జరుపుతోంది. గ్రిల్‌ గేట్‌ పగులగొట్టి పోలీస్‌ స్టేషన్‌ ఎదురుగా చోరీకి ప్లాన్‌ చేసిన గుర్తుతెలియని వ్యక్తుల సీసీటీవీ ఫుటేజీలను పరిశీలిస్తున్నారు. ఎలాంటి శబ్దం లేకుండా తాళం పగులగొట్టి స్టీల్‌ కట్టర్‌లను ఉపయోగించి దొంగలు ఈ ఘటనకు పాల్పడ్డారని ప్రాథమిక విచారణలో తేలింది. దీంతో పోలీసులు సీసీటీవీ ఫుటేజీలోని గుర్తుతెలియని వ్యక్తి ఫొటోను పోల్చి దర్యాప్తు చేస్తున్నారు.

No comments yet. Be the first to comment!
Add a comment

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement