యువతి కిడ్నాప్‌ | - | Sakshi
Sakshi News home page

యువతి కిడ్నాప్‌

Published Sat, Nov 16 2024 8:25 AM | Last Updated on Sat, Nov 16 2024 8:25 AM

-

కొరుక్కుపేట: బంధువుతో కలసి బైక్‌పై వెళ్తున్న కాలేజీ అమ్మాయిని జీపులో వచ్చిన ఆమె ప్రియుడు కిడ్నాప్‌ చేసి ఎత్తుకెళ్లాడు. కృష్ణగిరి జిల్లా గుండారపల్లి ప్రాంతానికి చెందిన 21 ఏళ్ల యువతి ఓ ప్రైవేట్‌ కళాశాలలో ఎంఏ ద్వితీయ సంవత్సరం చదువుతోంది. ఆమె ప్రశాంత్‌ (30)తో ప్రేమలో ఉంది. ఈ విషయం తెలుసుకున్న విద్యార్థిని తల్లిదండ్రులు గత మూడు నెలలుగా తమ కుమార్తెను వరత్తనపల్లి సమీపంలోని పెళ్లవర్తిపల్లిలో బంధువుల ఇంట్లో ఉంచారు. అక్కడి నుంచి బంధువు రోజూ ఉదయం బైక్‌పై కాలేజీకి తీసుకెళ్లి సాయంత్రం ఇంటికి తీసుకొచ్చేవాడు. అదేవిధంగా గురువారం తన బంధువుతో కలిసి ఆమె బైక్‌పై కాలేజీకి వెళుతోంది. మాత గుడి సమీపంలోకి వెళ్తుండగా.. జీపులో అటుగా వచ్చిన వ్యక్తులు కాలేజీ విద్యార్థినిని బలవంతంగా జీపు ఎక్కించి కిడ్నాప్‌ చేశారు. బంధువు దీన్ని ఆపేందుకు ప్రయత్నించినా సాధ్యం కాలేదు. ఈ విషయమై ఆమె తండ్రి మహారాజు పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఫిర్యాదు మేరకు పోలీసులు విచారణ చేపట్టారు. అందులో ప్రశాంత్‌ తన స్నేహితులతో కలసి జీపులో వచ్చి అపహరించినట్లు వెల్లడైంది. పోలీసులు ఇంకా వారి కోసం వెతుకుతూనే ఉన్నారు.

No comments yet. Be the first to comment!
Add a comment

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement