సైబర్ నేరాలపై అప్రమత్తత అవసరం
తిరువళ్లూరు: సైబర్ నేరగాళ్ల ఖాతాలపై బ్యాంక్ అధికారులు, పోలీసులు అప్రమత్తంగా వ్యవహరించాలని ఆవడి పోలీసు కమిషనర్ శంకర్ సూచించారు. తిరువళ్లూరు జిల్లా ఆవడి పోలీసు కమిషనరేట్ పరిధిలోని 51 ప్రభుత్వ బ్యాంకులు, నోడల్ అధికారులతో ఆవడి పోలీసు కమిషనర్ శంకర్ ప్రత్యేక సమావేశం నిర్వహించారు. కమిషనర్ శంకర్ మాట్లాడుతూ సైబర్ నేరగాళ్లు కాజేసే నగదును తిరిగి బధితులకు అప్పగించడానికి పోలీసులు తీసుకుంటున్న చర్యలకు బ్యాంకు అధికారులు తమ సహకారాన్ని అందించాలని పిలుపు నిచ్చారు. సైబర్ నేరగాళ్ల బ్యాంకు ఖాతాలపై అధికారులు అప్రమత్తంగా వ్యవహరించాలన్నారు. నేరగాళ్లు కాజేసే నగదును సులువుగా డ్రా చేసుకోకుండా అప్రమత్తంగా వ్యహరించాలని కమిషనర్ శంకర్ తెలిపారు. డిప్యూటీ కమిషనర్ ఆర్నాల్డ్‌మాస్టర్, పోలీసులు, ఉన్నతాధికారులు, బ్యాంకు అధికారులు పాల్గొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment