క్లుప్తంగా
కొలనులో
మునిగి బాలుడి మృతి
అన్నానగర్: కొలనులో మునిగి ఓ బాలుడు మృతిచెందాడు. చైన్నె సమీపం కోవిలంబాక్కం ఓంశక్తి నగర్‌కు చెందిన శ్రీనివాసన్. ఇతని కుమారుడు కమలకన్నన్ (14). కోవిలంబాక్కం ప్రభుత్వ ఉన్నత పాఠశాలలో 9వ తరగతి చదువుతున్నాడు. గురువారం సాయంత్రం పాఠశాల ముగించుకుని ఇంటికి వచ్చిన కమలకన్నన్ తన ఇద్దరు స్నేహితులతో కలిసి సున్నాంబు కులత్తూరు ప్రాంతంలోని ఆలయ కొలనులో స్నానానికి దిగారు. కమలకన్నన్‌న్‌లోతు ప్రాంతానికి వెళ్లడంతో ఈత రాకపోవడంతో నీటిలో మునిగిపోయాడు. ఇది చూసి స్నేహితులు కేకలు పెట్టారు. విషయం తెలిసి వేళచ్చేరి అగ్నిమాపక సిబ్బంది కొలనులో గల్లంతైన కమలకన్నన్ మృతదేహాన్ని వెలికితీశారు. పల్లికరనై పోలీసులు సంఘటన స్థలానికి చేరుకుని మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం ప్రభుత్వాస్పత్రికి తరలించి కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.
విద్యుత్ పొదుపుపై
పెయింటింగ్ పోటీలు
కొరుక్కుపేట: విద్యుత్ పొదుపుపై రాష్ట్ర స్థాయిలో పాఠశాల విద్యార్థులకు నిర్వహించిన పెయింటింగ్ పోటీల్లోని విజేతలుగా నగదు బహుమతులను ప్రదానం చేశారు. ఈ మేరకు ఇంధన పొదుపుపై జాతీయ ప్రచారంలో భాగంగా, విద్యుత్ మంత్రిత్వ శాఖ సహకారంతో బ్యూరో ఆఫ్ ఎనర్జీ ఎఫిషియెన్సీ (బీఈఈ), భారత ప్రభుత్వ ఎంటర్ ప్రైజ్ సంస్థ పవర్ గ్రిడ్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా లిమిటెడ్ సహకారంతో పాఠశాల విద్యార్థుల కోసం పెయింటింగ్ పోటీలను నిర్వహించారు. చైన్నెలోని అన్నా యూనివర్సిటీ క్యాంపస్‌లో తమిళనాడు రాష్ట్ర స్థాయి విజేతలకు బహుమతులు ప్రదానోత్స వం ఘనంగా జరిగింది. తమిళనాడు ప్రభుత్వ ప్రాథమిక పాఠశాల విద్యాశాఖ డైరెక్టర్ డాక్టర్ నరేష్ ముఖ్యఅతిథిగా, సీనియర్ సైంటిస్ట్ డాక్టర్ దీపక్ శామ్యూల్ హాజరయ్యారు. కార్యక్రమానికి సదరన్ రీజియన్ ట్రాన్స్‌మిషన్ సిస్టమ్–2 ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ చిత్రంబలం కృష్ణకుమార్ ఇంధన పొదుపు ప్రాముఖ్యతను వివరించారు. డాక్టర్ నరేష్ రాష్ట్ర స్థాయి చిత్రలేఖనం పోటీల్లో విజేతలకు నగదు బహుమతిని అందజేసి అభినందించారు.
Comments
Please login to add a commentAdd a comment