కోలాహలంగా కేక్‌ మిక్సింగ్‌ వేడుక | - | Sakshi
Sakshi News home page

కోలాహలంగా కేక్‌ మిక్సింగ్‌ వేడుక

Published Thu, Nov 21 2024 1:40 AM | Last Updated on Thu, Nov 21 2024 1:40 AM

కోలాహలంగా కేక్‌ మిక్సింగ్‌ వేడుక

కోలాహలంగా కేక్‌ మిక్సింగ్‌ వేడుక

సాక్షి, చైన్నె : క్రిస్మస్‌ పండుగను పురస్కరించుకొని వినియోగదారులను ఆకర్షించే విధంగా రుచికరమైన వంటకాలతో పాటు కేక్‌ను అందిం చేందుకు మహాబలిపురంలోని వెల్‌కమ్‌ హోటల్‌ కెన్సెస్‌ పాం బీచ్‌ అధినేత కె.నరసారెడ్డి ప్రత్యేక ఏర్పాట్లు చేశారు. ఈస్ట్‌ కోస్ట్‌ రోడ్డు లోని ప్రముఖ ప్రాంతమైన మహాబలిపురంలోని ఈ హోటల్‌ ప్రాంగణంలోని సముద్రతీరంలో నూతనంగా ప్రారంభించిన శ్రీనమ్మ షాక్‌ బీచ్‌శ్రీ రెస్టారెంట్‌లో బుధవారం సాయంత్రం కెన్సెస్‌ సీఈఓ ఎం. కృష్ణ సారథ్యంలో క్రిస్మస్‌ కేక్‌ మిక్సింగ్‌ సందడిగా సాగింది. ఎగ్జిక్యూటివ్‌ చెఫ్‌ సబూజ్‌ పాల్‌ సహా 30 మంది చెఫ్‌లు, సెలబ్రెటీలు, విదేశీ పర్యాటకులు కలసి పలు రకాల డ్రైఫ్రూట్స్‌, 35 లీటర్ల వివిధ రకాల ద్రవ్యాలతో ఉత్సాహంగా కేక్‌ మిక్సింగ్‌ చేశారు. ఈ మిశ్రమాన్ని 30 రోజులు నానబెట్టి క్రిస్మస్‌ ముందు విదేశీ స్టాయిలో రుచికరమైన కేక్‌ ను తయారుచేసి వినియోగ దారులకు అందజేయనున్నారు. ఈ కార్యక్రమంలో జనరల్‌ మేనేజర్‌ వీరేంద్ర తాపా, హోటల్‌ సిబ్బంది తదితరులు ఉత్సాహంగా పాల్గొని శాంతా క్లాజ్‌ వేషధారణలో సందడి చేశారు.ఈ సందర్భంగా సీఈఓ ఎం.కృష్ణ మాట్లాడుతూ క్రిస్మస్‌, 2025 నూతన సంవత్సర వేడుకలను కోలాహలంగా జరుపుకొనేందుకు, కస్టమర్లను ఆకర్షించే రీతిలో సదుపాయాలను భారీస్థాయిలో స్థాయిలో సమకూర్చుతున్నట్లు తెలిపారు.

No comments yet. Be the first to comment!
Add a comment

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement