చెట్టును ఢీకొన్న బైక్
– ముగ్గురు విద్యార్థుల దుర్మరణం
సేలం: కీల్పెన్నాత్తూర్ సమీపంలో చెట్టును బైక్ ఢీకొన్న ప్రమాదంలో ముగ్గురు విద్యార్థులు దుర్మరణం చెందారు. తిరువన్నామలై జిల్లా వేట్టవలం గ్రామానికి చెందిన వన్నియన్ కుమారుడు ముత్తులింగం (16), చిన్నఓలైపట్టి గ్రామానికి చెందిన రాజా కుమారుడు రామన్ (17), ఇసుక్కలికాట్టేరి గ్రామానికి చెందిన జగదీష్ (17). ఈ ముగ్గురు వేట్టవలం ప్రభుత్వ బాలుర మహోన్నత పాఠశాలలో ప్లస్‌టూ చదువుతున్నారు. వీరు మంగళవారం సాయంత్రం పాఠశాల ముగిసిన తర్వాత బైక్‌లో వేల్లవలం నుంచి తలవాయ్కుళం వైపు వెళ్లారు. ఆవూర్ మురుగన్ ఆలయం వద్ద వెళుతుండగా బైక్ అదుపుతప్పి రోడ్డు పక్కన ఉన్న చెట్టును ఢీకొంది. ఈప్రమాదంలో తీవ్రంగా గాయపడిన ముత్తులింగం సంఘటన స్థలంలోనే దుర్మరణం చెందాడు. రామన్, జగదీష్ తీవ్రంగా గాయపడ్డారు. సమాచారం అందుకున్న వేట్టవలం పోలీసులు సంఘటన స్థలానికి చేరుకుని గాయపడ్డ రామన్, జగదీష్‌లను తిరువణ్ణామలై ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. ప్రాథమిక చికిత్స అనంతరం మెరుగైన వైద్యం కోసం వేలూరు ప్రభుత్వ ఆస్పత్రికి తరలిస్తుండగా మార్గమధ్యంలోనే రామన్ మృతిచెందాడు. వేలూరు ఆస్పత్రిలో చికిత్స పొందుతూ జగదీశ్ బుధవారం మృతిచెందాడు. వేట్టవలం పోలీసులు కేసు దర్యాప్తు చేస్తున్నారు.
Comments
Please login to add a commentAdd a comment