క్రియాశీల సభ్యత్వంపై బీజేపీ ఉన్నత స్థాయి కమిటీలో చర్చ
సాక్షి, చైన్నె: చైన్నెలోని రాష్ట్ర పార్టీ ప్రధాన కార్యాల యం కమలాలయంలో తమిళనాడు బీజేపీ ఉన్నత స్థాయి కమిటీ సమావేశం బుధవారం జరిగింది. తమిళనాడు, కర్ణాటక బీజేపీ జాతీయ కో–ఇంఛార్జి డాక్టర్ సుధాకర్‌రెడ్డి నేతృత్వంలో జాతీయ కార్యవర్గ సభ్యు డు, తమిళనాడు బీజేపీ సమన్వయ కమిటీ కన్వీనర్ హెచ్. రాజా అధ్యక్షత ఈ సమావేశం జరిగింది. జాతీ య కార్యదర్శి తమిళనాడు ఇన్చార్జ్ ముఖ్య అతిథిగా అరవింద్ మీనన్ ఈ సమావేశానికి హాజరయ్యారు. బీజేపీ నేతలు నైనార్ నాగేంద్రన్, పొన్ రాధాకృష్ణన్, తమిళిసై సౌందరారజన్, వానతీ శ్రీనివాసన్, కేశవ వి నాయగం, తదితర నేతలు ఈ సమావేశంలో పలు అంశాలపై ప్రస్తావించారు. ప్రధానంగా ప్రస్తుతం కొనసాగుతున్న బీజేపీ క్రియాశీల సభ్యత్వ నమోదు పురోగ తిని ఇందులో సమీక్షించారు. తమిళంలోని అన్ని బూత్‌లలో పార్టీ సంస్థాగత ఎన్నికలను విజయవంతంగా పూర్తి చేయడానికి చర్యలు తీసుకున్నారు. డీఎంకే ప్రజా వ్యతిరేక విధానాలను ప్రజలలోకి తీసుకెళ్లే విధంగా పోరాటాలు, ప్రధాని నరేంద్ర మోదీ సంక్షేమ పథకాలను ప్రజలకు వివరించే విధంగా కార్యక్రమాలకు నిర్ణయించారు.
Comments
Please login to add a commentAdd a comment