ఇంటిలోపల తల్లి, కుమారుడి మృతదేహాలు
● నాలుగు రోజుల తర్వాత స్వాధీనం ● కంటతడిపెట్టించిన లేఖ లభ్యం
సేలం : తంజావూరు సమీపంలో ఇంటిలోపల తల్లి, కుమారుడి మృతదేహాలను నాలుగు రోజుల తర్వాత పోలీసుల స్వాధీనం చేసుకున్నారు. తంజావూరులో మునిసిపల్ కాలనీకి చెందిన మధనగోపాల్. ఇతని భార్య ఈశ్వరి (59). వీరి కుమారుడు రాహుల్ (29). ఇంజినీరింగ్ చదువుకున్న రాహుల్ ఇంటిలో సొంతంగా వ్యాపారం చేస్తున్నాడు. గత 15 సంవత్సరాల క్రితం మదన్‌గోపాల్ మృతి చెందడంతో ఇంటిలో ఈశ్వరి, రాహుల్ నివసిస్తూ వచ్చారు. ఈ స్థితిలో గత నాలుగు రోజులుగా ఇల్లు మూసి ఉండడంతో ఈశ్వరి, రాహుల్ వేరే ఊరికి వెళ్లి ఉంటారని స్థానికులు భావించారు. ఈ స్థితిలో మంగళవారం ఉదయం ఈశ్వరి ఇంటికి వచ్చిన పూలు అమ్మే యువతి ఆ ఇంటిలో నుంచి దుర్వాసన వీస్తుండడాన్ని గుర్తించింది. సందేహించిన స్థానికులు ఇచ్చిన సమాచారం మేరకు తంజావూరు ప్రభుత్వ వైద్య కళాశాల పోలీసు అక్కడికి చేరుకుని ఇంటి తలుపులు పగులగొట్టి లోపలికి వెళ్లి చూడగా ఇక్కడ ఈశ్వరి మంచంపైన, రాహుల్ ఉరికి వేలాడుతూ మృతదేహాలుగా కనిపించారు. కుల్లిన స్థితిలో ఉన్న వారి మృతదేహాలను స్వాధీనం చేసుకున్న పోలీసులు శవపంచనామా నిమిత్తం ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. అనంతరం పోలీసులు ఆ ఇంటిలోపల పరిశోధనలు చేపట్టగా, అక్కడ కంటతడిపెట్టించే విధమైన రాహుల్ రాసిన ఒక లేఖ లభ్యమైంది. అందులో ఉన్న ప్రకారం గుండె పోటుతో తల్లి మృతి చెందడంతో, తల్లి, తండ్రి లేక అనాథగా మారిన రాహుల్ కూడా ఉరి వేసుకుని ఆత్మహత్య చేసుకున్నట్టు పోలీసులు నిర్ధారించారు. ఈ ఘటన ఆ ప్రాంతంలో కలకలం రేపింది.
Comments
Please login to add a commentAdd a comment