సాగర తీరంలో నిఘా
– సీ విజిల్ పేరిట మాక్ డ్రిల్
సాక్షి, చైన్నె: చైన్నె నుంచి కన్యాకుమారి వరకు బుధవారం ఉదయం నుంచి సీ విజిల్ పేరిట సాగర తీరంలో నిఘాను పటిష్టం చేసి భద్రతను పర్యవేక్షిస్తున్నారు. కోస్టుగార్డు, నావికాదళం, మైరెన్ పోలీసులు, సముద్ర తీర భద్రతా విభాగం తదితర భద్రతా బలగాలు ఉదాయాన్నే రంగంలోకి దిగాయి. ముంబైలో గతంలో జరిగిన దాడిలో నిందితులు సముద్ర మార్గం గుండా ప్రవేశించినట్టుగా వెలుగు చూసిన నేపథ్యంలో తరచూ సాగరం మీద నిఘా వేస్తూ వస్తున్న విషయం తెలిసిందే. సాగర్ కవచ్, ఆపరేషన్ ఆమ్లా, ఆపరేషన్ సురక్ష పేరిట భద్రతా పరంగా మాక్ డ్రిల్ నిర్వహిస్తూ వస్తున్నారు. ప్రస్తుతం సీ విజిల్‌పేరిట తీరం వెంబడి భద్రత మీద దృష్టి పెట్టారు. గురువారం కూడాఈ మాక్‌డ్రిల్ కొనసాగనుంది. సిబ్బంది ఏ మేరకు అప్రమత్తంగా ఉన్నారో తెలుసుకునేందుకు అధికారులు కొందరు మప్టీలో చక్కర్లు కొడుతూ భద్రతను పర్యవేక్షించారు. రాష్ట్రంలోని 51 ప్రాంతాలలో సీ విజిల్ 24 మాక్ డ్రిల్ జరుగుతున్నట్లు అధికారులు ప్రకటించారు.
Comments
Please login to add a commentAdd a comment