దక్షిణ తమిళనాడుకు రెడ్ అలర్ట్
– ఆరు గంటలలో 24 సెం.మీ వర్షం
సాక్షి, చైన్నె: దక్షిణ తమిళనాడుకు రెడ్ అలర్ట్ ప్రకటిస్తూ వాతావరణ కేంద్రం హెచ్చరికలు జారీ చేసింది. బుధవారం డెల్టా జిల్లాలో కుండపోతగా వర్షం కురిసింది. వర్షాలు కొనసాగుతుండటంతో రైతులలో ఆందోళన తప్పడం లేదు. రామనాధపురంలో ఆరు గంటలలో 24 సె.మీ వర్షం కురిసింది. రాష్ట్రంలో ఈశాన్య రుతు పవనాలు విస్తరించిన విషయం తెలిసిందే. గత మూడు నాలుగు రోజులుగా డెల్టా జిల్లాలైన నాగపట్నం, మైలాడుతురై, తంజావూరు, తిరువారూర్ జిల్లాలో విస్తారంగా వర్షాలు పడుతున్నాయి. బుధవారం అనేక ప్రాంతాలలో కుండ పోత వర్షం కురవడంతో లోతట్టు ప్రాంతాలు జలమయం అయ్యాయి. రామనాథపురంలో అయితే, మేఘం ఒక్కసారిగా ఉరిమినట్టుగా ఆరు గంటలలో 24 సెం.మీ వర్షం పడింది. లోతట్టు ప్రాంతాలలోకి వర్షపు నీరు పోటెత్తింది. డెల్టా జిల్లాలో వర్షాలు కొనసాగుతుండడంతో రైతులలో ఆందోళన పెరిగింది. చేతికి అంది వస్తున్న వరి పంటను వర్షం రూపంలో ఎక్కడ వరదలు ముంచెత్తుతాయో అనే ఆందోళన తప్పడం లేదు. అదే సమయంలో గురువారం దక్షిణ తమిళనాడులోని జిల్లాలకు రెడ్ అలర్ట్ ప్రకటించారు. అతి భారీ వర్షాలు అనేక చోట్ల కురిసే అవకాశాలు ఉన్నాయని వాతావరణ కేంద్రం హెచ్చరించడంతో అధికార యంత్రాంగం అలర్ట్ అయ్యింది. ముందు జాగ్రత్తలో ప్రజలకు ఏదేని నష్టాలు, కష్టాలు ఎదురైనా ఆదుకునే విధంగా చర్యలు ముమ్మరం చేశారు.
Comments
Please login to add a commentAdd a comment