ఘనంగా సింధు నాగరికత పరిశోధన శత వార్షికోత్సవం
కొరుక్కుపేట: చైన్నె సైదాపేటలోని యూనివర్సిటీలో సింధు నాగరికత పరిశోధన శాతవార్షికోత్సవం బుధవారం ఘనంగా జరిగింది. తమిళ అభివద్ధి సంస్థ చై ర్మన్ వీఐటీ విశ్వవిద్యాలయం చాన్స్‌లర్ ప్రొఫెసర్ జి. విశ్వనాథన్ అధ్యక్షతన జరిగిన తమిళ సంస్కృతి విభా గం కార్యదర్శి వనంగాముడి ఆహుతులను ఆహ్వానించారు. ఎస్‌ఆర్ముగం ప్రారంభ ఉపన్యాసం చేశారు. త మిళనాడు ఓపెన్ యూనివర్సిటీ తమిళ విభాగం డైరెక్ట ర్ ఎస్ బాలసుబ్రహ్మణ్యం సింధు నాగరికత విశిష్టతను వివరించారు. అదేవిధంగా ద్రావిడ సంస్కృతి అంశంపై సూర్య జేవియర్ మాట్లాడారు. ఈ వేడుకల్లో అమర్నాథ్ రామకృష్ణ ఎ.కరుణానందన్ ప్రొఫెసర్ ఎ.పద్మా వతి సింధు నాగరికత పురావస్తు పరిశోధన అంశంపై ప్రసంగించారు. ప్రొఫెసర్ అబ్దుల్ ఖాదర్ ప్రొఫెసర్ ప దుమానార్, తమిళ విభాగం ఉపాధ్యక్షులు జె. మోహన్, కార్యదర్శి ఎం. చిదంబర భారతి పాల్గొన్నారు. కార్యక్రమంలో భాగంగా సింధు నాగరికత త వ్వకాల్లో బయటపడిన పురాతన వస్తువులతో కూడిన ఫొటో ప్రదర్శన ఏర్పాటు చేశారు. అసిస్టెంట్ ప్రొఫెసర్ వైయాపురి పాల్గొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment