క్లుప్తంగా
విద్యుత్ షాక్‌తో
కేబుల్ టీవీ ఉద్యోగి మృతి
కొరుక్కుపేట: విద్యుత్ షాక్ తగిలి కేబుల్ టీవీ ఉద్యోగి మృతి చెందిన ఘటనతో ఆ ప్రాంతంలో విషాదఛాయలు చోటుచేసుకున్నాయి. కాంచీపురంలోని ఒరికాయికాక్ ప్రాంతంలో నివాసం ఉంటున్న మురుగన్ (49) కేబుల్ ఉద్యోగిగా పనిచేస్తున్నారు. ఈక్రమంలో విద్యుత్ తీగను మార్చేందుకు ప్రయత్నించగా హైవోల్టేజీ వైరు తగిలి షాక్‌కు గురై అక్కడికక్కడే మృతి చెందారు. ఈ ఘటనపై మురుగన్ భార్య ఫిర్యాదు మేరకు కాంచీపురం తాలుకా పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. కాగా మృతుడు మురుగన్‌కు ఇద్దరు కుమార్తెలు ఉన్నారు.
ఘనంగా ఈఎల్ –బేతేల్
బైబిల్ కాలేజ్ స్నాతకోత్సవం
కొరుక్కుపేట: చైన్నె రాయపురంలోని ఈఎల్–బేతేల్ బైబిల్ కాలేజ్ 36 వ గ్రాడ్యుయేటింగ్ క్లాస్ ( 2023–24) స్నాతకోత్సవ వేడుకలు సోమవారం ఘనంగా నిర్వహించారు. కళాశాల ప్రాంగణంలో జరిగిన ఈ వేడుకలకు గోవాకు చెందిన డాక్టర్ రోన్ ముఖ్యఅతిథిగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా కోర్సులను పూర్తి చేసిన విద్యార్థులకు సర్టిఫికెట్లు ,జ్ఞాపికలను ప్రదానం చేశారు. అనంతరం ఆమె విద్యార్థులకు విలువైన సూచనలు చేసి అశీర్వదించారు. కార్యక్రమంలో కళాశాల నిర్వాహకులు, సిబ్బంది, విద్యార్థులు పాల్గొన్నారు.
మరణంలోనూ ఒక్కటిగా..!
● వయోభారం కారణంగా
ఒకే సమయంలో దంపతులు మృతి
అన్నానగర్: కృష్ణగిరి జిల్లా తేన్ కనిక్కోట సమీపంలోని మేగలకౌండనూరు గ్రామానికి చెందిన గోవిందస్వామి (80). రైతు అయిన ఇతనికి భార్య (75) రామక్క, ఇద్దరు కుమారులు, ఐదుగురు కుమార్తెలు ఉన్నారు. అందరికీ పెళ్లయ్యింది. ఏడాది కాలంగా రామక్క ఆరోగ్యం దెబ్బతింది. గోవిందస్వామి వయోభారంతో పనికి వెళ్లడం లేదు. తల్లీ, తండ్రీని ఇద్దరూ కొడుకులు చూసుకుంటున్నారు. ఆదివారం రాత్రి గోవిందస్వామి పెద్ద కుమారుడు శ్రీనివాసన్ తన భార్య వెంకటలక్ష్మితో కలిసి వెళ్లి గంజి తాగి పడుకోవాలని తల్లిదండ్రులకు చెప్పాడు. ఈ స్థితిలో సోమవారం ఉదయం వెళ్లి తల్లిదండ్రులను చూశాడు. ఇద్దరూ కదలకుండా మంచం మీద పడుకున్నారు. వారిని తాకగా, ఇద్దరూ చనిపోయారు. తల్లిదండ్రుల మృతదేహాన్ని చూసి శ్రీనివాసన్ చలించిపోయాడు. వయోభారంతో భార్యాభర్తలిద్దరూ ఒకేసారి మృతి చెందడంతో గ్రామంలో విషాదఛాయలు అలుముకున్నాయి.
ఇద్దరిపై
గూండా యాక్ట్
తిరువళ్లూరు: వేర్వేరు కేసుల్లో ప్రధాన నిందితులుగా వున్న ఇద్దరిపై గుండా చట్టాన్ని ప్రయోగిస్తూ తిరువళ్లూరు కలెక్టర్ డాక్టర్ ప్రభుశంకర్ ఉత్తర్వులు జారీ చేశారు. వివరాలు.. తిరువళ్లూరు పెద్దకుప్పం ప్రాంతానికి చెందిన ఆకాష్ (25) ఉధయ(24). ఇద్దరిని గత నెల 8న ఘర్షణ కేసులో అరెస్టు చేసి డీఎస్పి తమిళరసి విచారణ చేపట్టారు. పోలీసుల విచారణలో ఇద్దరిపై తిరువల్లూరు, కడంత్తూరు, మనవాలనగర్‌తో పాటు వేర్వేరు పోలీసు స్టేషన్‌లో చోరీ, గొడవలు, చైన్‌స్నాచింగ్ కేసులు పెండింగ్‌లో ఉన్నట్టు గుర్తించారు. వీరి ప్రవర్తననూ మార్చుకోవాలని పలుమార్లు హెచ్చరించినా ఫలితం లేకపోయింది. ఈ క్రమంలో ఇద్దరిపై గుండా చట్టాన్ని ప్రయోగించాలని ఎస్పీ శ్రీనివాసపెరుమాల్ జిల్లా కలెక్టర్ ప్రభుశంకర్‌కు సిఫార్సు చేశారు. ఎస్పీ సిపార్సును పరిశీలించిన కలెక్టర్ ఇద్దరిపై గుండా చట్టాన్ని ప్రయోగిస్తూ ఉత్తర్వులు జారీ చేశారు.
ఫ్యాషన్ ప్రతిభావంతుల
కోసం మిస్ దివా 2024
సాక్షి, చైన్నె: ఫ్యాషన్ రంగంలోని మహిళా ప్రతిభావంతులను గుర్తించి, అందలం ఎక్కించే విధంగా భారతదేశపు అతిపెద్ద ఫ్యాషన్ హంట్‌గా లైవ్ మిస్ దివా 2024కు శ్రీకారం చుట్టామని నిర్వాహకులైన ప్రముఖ డిజైనర్లు సోనాక్షి రాజ్, భావనా సింగ్, రిత్విక లుప్రకటించారు. ఈ వివరాలను స్థానికంగా సోమవారం వివరించారు. మిస్ దివా మహిళల కోసం ప్రత్యేకంగా ఒక గ్రౌండ్ బ్రేకింగ్ ఫ్యాషన్ టాలెంట్ హంట్‌గా ప్రారంభించామన్నారు. ఇది భారతదేశంలో ఇంతకు ముందెన్నడూ ఎవ్వరూ చేయని మార్గదర్శక కార్యక్రమం అని వివరించారు. ఈ పోటీ ఫ్యాషన్ పరిశ్రమలో మహిళల అపారమైన ప్రతిభను, వారి నైపుణ్యాలు, సృజనాత్మకత, అభిరుచిని ప్రదర్శించడానికి ప్రతిష్టాత్మక వేదిక అని ప్రకటించారు. ఔత్సాహిక మహిళలు, టాప్ మోడల్, ఫ్యాషన్ డిజైనర్, ఫ్యాషన్ కంటెంట్ క్రియేటర్ వంటి ప్రఖ్యాత నిపుణుల గుర్తింపును పొందేందుకు వీలుంటుందన్నారు. మిస్ దివా 2024 అనేది ఒక పోటీ అని చెప్పడం కన్నా, బ్యూటీ, ఫ్యాషన్ పరిశ్రమలో మహిళల సాధికారత కోసం ఒక ఉద్యమం – ప్రతిభ, పట్టుదల, విశ్వాసంతో ఔత్సాహిక మహిళల కోసం ఒక–స్టాప్ లాంచ్ ప్యాడ్‌గా ఉంటుందని వివరించారు.
Comments
Please login to add a commentAdd a comment