విమల్ 34వ చిత్రం ఫస్ట్‌లుక్ పోస్టర్ విడుదల
తమిళసినిమా: నటుడు విమల్ కథానాయకుడిగా నటిస్తున్న 34వ చిత్రానికి పరమశివన్ ఫాతిమ అనే టైటిల్‌ను నిర్ణయించారు. నటి సాయాదేవి నాయకిగా నటించిన ఇందులో ఎంఎస్.భాస్కర్, శ్రీరంజనీ, ఆదిరా, అరుళ్‌దాస్, కూల్ సురేశ్, కాదల్ సుకుమార్ తదితరులు ముఖ్య పాత్రలను పోషించిన ఈ చిత్రాన్ని లక్ష్మీ క్రియేషన్స్ పతాకంపై దర్శకుడు ఇసక్కీకర్వాణన్ స్వీయ దర్శకత్వంలో నిర్మిస్తున్నారు. ఈయన ఇంతకు ముందు కుడిమగన్, పెట్టిక్కడై, బక్రీ వంటి వైవిధ్యభరిత కథా చిత్రాలకు దర్శకత్వం వహించారు. కాగా చిత్ర వివరాలను మీడియాకు విడుదల చేసిన ప్రకటనలో దర్శకుడు పేర్కొంటూ ఇది ఒక కొండ ప్రాంతంలో ఏర్పడిన మత పరమైన సమస్యను ఆవిష్కరించే కథా చిత్రంగా ఉంటుందన్నారు. ప్రేమకు మతం ఎలా ఆటంకంగా మారుతుందనే విషయాన్ని ఈ చిత్రంలో చెప్పినట్లు తెలిపారు. షూటింగ్‌ను పూర్తి చేసిన ఈ చిత్రానికి సంబంధించిన నిర్మాణాతర కార్యక్రమాలు ఇప్పుడు జరుగుతున్నాయని చెప్పారు. కాగా చిత్రాన్ని త్వరలోనే తెరపైకి తీసుకురావడానికి సన్నాహాలు చేస్తున్నట్లు పేర్కొన్నారు. ఒకపోతే ఈ చిత్ర ఫస్ట్‌లుక్ పోస్టర్‌ను నటుడు విజయ్‌సేతుపతి తన ఎక్స్ మీడియా ద్వరా విడుదల చేసినట్లు దర్శకుడు చెప్పారు. దీనికి దీపన్ చక్రవర్తి సంగీతాన్ని, సుకుమార్ ఛాయాగ్రహణం అందిస్తున్నారు.
పరమశివన్ ఫాతిమా చిత్ర ఫస్ట్‌లుక్ పోస్టర్,
పక్కన నటుడు విమల్
Comments
Please login to add a commentAdd a comment