ఆర్కేపేట యూనియన్ సమితి సమావేశం
పళ్లిపట్టు: ఆర్కేపేట యూనియన్ సమితి సమావేశంలో వెడియంగాడులో ప్రాథమిక ఆరోగ్య కేంద్రం ఏర్పాటు చేయాలని యూనియన్ కౌన్సిలర్ డిమాండ్ చేశారు. దీంతో ఈ మేరకు తీర్మానం ఆమోదించారు. వివరాలు.. రాష్ట్రంలో స్థానిక సంస్థల పదవీ కాలం ఈ ఏడాది చివరకు పూర్తి కానున్న క్రమంలో ఆర్కేపేట యూనియన్ సమితి చివరి సమావేశం చైర్‌పర్సన్ రంజిత ఆధ్వర్యంలో శుక్రవారం నిర్వహించారు. ఇందులో యూనియన్ కౌన్సిలర్లు, బీడీఓలు పాల్గొన్నారు. యూనియన్ జనరల్ నిధుల నుంచి రూ. 66 లక్షల వ్యయంతో మౌలిక సదుపాయాలు కల్పనకు సభ ఆమోదముద్ర వేసింది. సమావేశంలో భాగంగా గ్రా మీణ ప్రాంతాలు నిండిన వెడియంగాడులో ప్రభుత్వ ప్రాథమిక ఆరోగ్య కేంద్రం కోసం ఐదేళ్లుగా సభ దృష్టికి తీసుకొచ్చిన ఫలితం శూన్యమని, చివరి సమావేశంలోనైనా తీర్మానం ఆమోదించి వెనుకబడిన గ్రా మాలు నిండిన వెడియంగాడు ప్రాంతంలో ప్రభుత్వ ప్రాథమిక ఆరోగ్య కేంద్రం ఏర్పాటు చేయాలని డీఎంకే కౌన్సిలర్ శివకుమార్ డిమాండ్ చేశారు. ఈ మేరకు సభ తీర్మానం ఆమోదించింది. వైస్ చైర్‌పర్సన్ తిలకవతి, బీడీఓలు కలైసెల్వి, సెంథిల్‌కుమార్ పాల్గొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment