రక్తదాన శిబిరానికి అనూహ్య స్పందన
కొరుక్కుపేట: పుళల్ లయన్న్స్ క్లబ్ హ్యుమానిటీ ఆధ్వర్యంలో శనివారం నిర్వహించిన రక్తదాన శిబిరానికి అనూహ్య స్పందన లభించింది. పుళల్ కావంగరై తిరునీలకంఠనగర్లో మొబైల్ రక్తదాన శిబిరం ఏర్పాటు చేశారు. శిబిరంలో 100 మందికిపైగా రక్తదానం చేశారు. పుళల్ లయన్న్స్క్లబ్ హ్యుమానిటీ 324జే.గవర్నర్ ఏటీ రవిచంద్రన్, అన్నాడీఎంకే జనరల్ బాడీ మెంబర్ ఎం.సుందర్ రక్తదాన శిబిరాన్ని ప్రారంభించారు. రక్తదానం చేసి ప్రాణదాతలు కావాలని పిలుపునిచ్చారు. రక్తదాన శిబిరం ఏర్పాట్లను లయన్న్స్ క్లబ్ ప్రెసిడెంట్ కేఎం. ప్రకాష్, ఫౌండర్ లయన్ రవి, జి.మురళి, ఎస్.రమేష్, బి.సుమన్, బి.బాలాజి, రామకృష్ణ, చిట్టిబాబు, నరసింహరావు పాల్గొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment