అన్నానగర్: కాంచీపురం కార్పొరేషన్ ఉప్పరికులం వీధికి చెందిన శంకర్. ఇతని 2వ కుమార్తె మోనిక (4) అదే జిల్లాలోని అంగన్వాడీ కేంద్రంలో చదువుతోంది. శనివారం మధ్యాహ్నం అంగన్వాడీ కేంద్రం నుంచి ఇంటికి వచ్చిన మోనికకు ఒక్కసారిగా వాంతులు, విరేచనాలు అయ్యాయి. ఇందుకోసం ఆసుపత్రిలో చేరిన మోనిక మృతి చెందింది. అంగన్వాడీ కేంద్రంలో ఆహారం తిన్న చిన్నారికి విరోచనాలు, వాంతులు అయినట్లుగా ఫిర్యాదు చేశారు. వైద్యులు మోనిక మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం పంపించారు. అదే సమయంలో వారం రోజులుగా కార్పొరేషన్ సరఫరా చేస్తున్న తాగునీరు తాగి చిన్నారి మృతి చెందిందా? అని కూడా పోలీసులు విచారిస్తున్నారు.
Comments
Please login to add a commentAdd a comment