డాక్టర్ కాపాడిన కోతి పిల్ల జూలో మృతి
● పోస్టుమార్టం రిపోర్ట్ సమర్పించాలని హైకోర్టు ఆదేశం
సేలం : కుక్కల దాడికి గురై డాక్టర్ చేతిలో ప్రాణం పోసుకున్న కోతి పిల్ల వండలూరు జూలో మృతి చెందింది. చైన్నె హైకోర్టులో పశు వైద్యులు వల్లయప్పన్ దాఖలు చేసిన ఓ పిటిషన్‌లో.. 2023, డిసెంబర్ 4వ తేది రాణిపేటలో కుక్కలకు వ్యాక్సిన్ వేస్తున్న సమయంలో అక్కడ కుక్క కాటుకు గురైన కోతి పిల్లను తాను సుమారు 10 నెలలు చికిత్స చేసి కాపాడినట్టు తెలిపారు. అయితే గత నెల 26వ తేది ఆ కోతి పిల్లను అటవీ శాఖ అధికారులు తన నుంచి తీసుకువెళ్లి వండలూరు జూలో పెట్టినట్టు పేర్కొన్నారు. తనకు ఆ కోతి పిల్లను అప్పగించాలని కోరగా, అది వీలుపడదని, కావాలంటే అప్పుడప్పుడు వెళ్లి చూసుకోవచ్చని కోర్టు తెలిపిందన్నారు. ఈ స్థితిలో వండలూరు జూలో ఉన్న కోతి పిల్ల గత 21వ తేది మృతి చెందింది. కనుక దాని మృతిపై విచారణ జరపాలని పశువైద్యులు వల్లయప్పన్ తరపున న్యాయవాది శంకరసుబ్బు న్యాయమూర్తి కార్తికేయన్ ముందు విన్నవించుకున్నారు. ఈ కేసును విచారించిన న్యాయమూర్తి సి.వి.కార్తికేయన్ కోతి పిల్లకు ఎలాంటి వైద్యం చేశారు అని, మృతి చెందిన కోతి పిల్ల పోస్టుమా ర్టం రిపోర్ట్‌ను కోర్టులో దాఖలు చేయాలని ఆదేశిస్తూ కేసును 28వ తేదీకి వాయిదా వేశారు.
కోతి పిల్లతో డాక్టర్
Comments
Please login to add a commentAdd a comment