వర్షంకాలం జాగ్రత్తలపై అవగాహన
తిరుత్తణి: నవంబర్– 1 స్థానిక సంస్థల దినోత్సవం సందర్భంగా శనివారం గ్రామ సభలు నిర్వహించారు. తిరుత్తణి యూని యన్ కోరమంగళం పంచాయతీ సర్పంచ్ నరసింహరాజు అధ్యక్షతన నిర్వహించిన గ్రామ సభలో గ్రామస్తులు పెద్ద ఎత్తున పాల్గొన్నారు. స్థానిక సంస్థల బలోపేతం, గ్రామంలో కనీస సదుపాయాలు కల్పన పట్ల చర్చలు జరిగాయి. వర్షాకాలం సమీపిస్తున్న క్రమంలో ముందస్తు జాగ్రత్తలను తెలియజేశారు. ప్రదానంగా పొగాకు రహిత గ్రామాల పట్ల ఆరోగ్యశాఖ సిబ్బంది గ్రామీణులకు అవగాహన కల్పించారు. అలాగే పళ్లిపట్టు యూనియన్‌లోని గొళ్లాలకుప్పం, పాండ్రవేడు, పెరమానళ్లూరు, రామచంద్రాపురం, మేళపూడి, సహా వివిధ పంచాయతీల్లో స్థానిక సంస్థల దినోత్సవ గ్రామ సభలు నిర్వహించి వర్షాకాలం ముందస్తు జాగ్రత్తలు పట్ల అవగాహన కల్పించారు. గొళ్లాలకుప్పం పంచాయతీ సర్పంచ్ పుష్పలత లోకనాథం ఆధ్వర్యంలో గ్రామసభ నిర్వహించారు. పొగాకు రహిత గ్రామంగా గొళాలకుప్పం ఎంపిక చేసి తీర్మానం ఆమోదించారు.
Comments
Please login to add a commentAdd a comment