బీపీ చెక్‌లో రికార్డు...
సవీత ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ అండ్ టెన్నికల్ సైన్సెస్ పరిధిలోని కాలేజ్ ఆఫ్ నర్సింగ్‌లో ఆరు గంటలలో 10,308 మందికి రక్త పోటు రీడింగ్(బీపీ చెక్) చేసి కొత్త రికార్డును సృష్టించారు. ఫిలిప్పీన్స్‌లోని వరల్డ్ రికార్డ్ యూనియన్ దీనిని అధికారికంగా గుర్తించి అవార్డుకు గాను సర్టిఫికెట్‌ను ప్రకటించింది. దీనిని ఆ విద్యా సంస్థ చాన్స్‌లర్ డాక్టర్ ఎన్ఎమ్ వీరయ్యన్, ప్రొ వీసీ డాక్టర్ దీపక్ నల్లస్వామి, ప్రిన్సిపల్ డాక్టర్ విజయలక్ష్మి, వైస్ ప్రిన్సిపల్ పరిమళలు వరల్డ్ రికార్డు యూనియన్‌కు చెందిన క్రిష్టోఫర్ నుంచి శనివారం అందుకున్నారు. – సాక్షి, చైన్నె
Comments
Please login to add a commentAdd a comment