రాష్ట్రంలో తగ్గిన శిశు మరణాలు
తిరువళ్లూరు: రాష్ట్రంలో శిశు మరణాల రేటు 5.7శాతానికి తగ్గిందని రాష్ట్ర ఆరోగ్యశాఖ సంక్షేమశాఖ మంత్రి సుబ్రమణ్యం అన్నారు. తిరువళ్లూరు జిల్లా అయపాక్కంలో సామూహిక సీమంతం, వైద్యశిబిరం, బాలింతలకు కిట్‌లు అందజేసే కార్యక్రమం శనివారం జరిగింది. కలెక్టర్ డాక్టర్ ప్రభుశంకర్ అధ్యక్షతన వహించగా మంత్రులు సుబ్రమణ్యం, నాజర్ హాజరయ్యారు. మొదట వైద్యశిబిరాన్ని ప్రారంభించి సామూహిక శీమంతం కార్యక్రమంలో పాల్గొన్న మహిళలకు పసుపు, కుంకుమం చీర, గర్భిణులకు రాష్ట్ర ప్రభుత్వం తరఫున అందజేశారు. అనంతరం బాలింతలకు కిట్‌లను అందజేశారు. ఎమ్మెల్యేలు కృష్ణస్వామి, కారపాక్కం గణపతి, పంచాయతీ అధ్యక్షుడు దురైవీరమణి పాల్గొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment