రిజర్వేషన్లను ఆరు శాతానికి పెంచాలి
● ముఖ్యమంత్రి స్టాలిన్‌కి మంద కృష్ణ మాదిగ విజ్ఞప్తి
కొరుక్కుపేట: తమిళనాడులో అరుంధతీయులకు కల్పించిన 3 శాతం రిజర్వేషన్లను 6 శాతానికి పెంచాలని మాదిగ రిజర్వేషన్ పోరాట సమితి (ఎమ్మార్పీఎస్) జాతీయ అధ్యక్షులు మంద కృష్ణ మాదిగ ముఖ్యమంత్రి స్టాలిన్ ప్రభుత్వానికి విజ్ఞప్తి చేశారు. అరుంధతీయ రిజర్వేషన్ పోరాట సమితి (ఎమ్మార్పీఎస్) – తమిళనాడు విభాగం అధ్యక్షులు టి.లోకేష్ కుమార్ అధ్యక్షతన స్థానిక చేట్‌పెట్ లోని వరల్డ్ యూనివర్సిటీ సర్వీస్ సెంటర్‌లో భారత రాజ్యాంగ చట్ట న్యాయం గెలుస్తుంది. మహానాడు ఘనంగా జరిగింది. ఈ మహానాడుకు ముఖ్యఅతిథిగా విచ్చేసిన మంద కృష్ణ మాదిగ ముందుగా వేదికపై ఏర్పాటు చేసిన బాబా సాహెబ్ డాక్టర్ అంబెడ్కర్, బాబూ జగజీవన్ రావు, జ్యోరావు పూలే చిత్రపటాలకు నివాళు అర్పించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ ఎస్సీ వర్గీకరణకు అనుకూలంగా సుప్రీంకోర్టు తీర్పునివ్వడం 30 ఏళ్ల ఎమ్మార్పీఎస్ పోరాట ఫలితమే అన్నారు. తమిళనాడు జనాభాలో అత్యదిక మెజారిటీ కలిగిన అరుంధతీయులకు న్యాయం కల్పించేలా దివంగత మాజీముఖ్యమంత్రి కరుణానిధి ఎస్సీరిజర్వేషన్ లో 3 శాతం అంతర్గత రిజర్వేషన్ ను కల్పించారని ఆయనకు మాదిగలు రుణపడి ఉంటారన్నారు. ప్రస్తుతం ముఖ్యమంత్రి స్టాలిన్ నేతృత్వంలోని ప్రభుత్వం కూడా ఈ రిజర్వేషన్‌ను అమలు పరచడాన్ని స్వాగతిస్తూ ధన్యవాదాలు తెలిపారు. అరుంధతీయులకు కల్పించిన 3 శాతం రిజర్వేషన్‌ను 6 శాతం గా పెంచి ఆదుకోవాలని సభా ముఖంగా సీఎం స్టాలిన్ కు విజ్ఞప్తి చేశారు. రాష్ట్రంలో ఎమ్మార్పీఎస్ వ్యవస్థను మరింత బలోపేతం చేసేందుకు లోకేష్ కుమార్ బృందం కృషి చేయాలని సూచించారు. ఎమ్మార్పీఎస్ నాయకులు ఎంఎం కొండయ్య, కె. సుకుమార్, ఇరకట్ల నాగభూషణం దర్శిగుంట కిషోర్, వసంత రావు, పుల్లాపురం కె. కుమార్, ఆది తమిలర్ పార్టీ అధ్యక్షులు జెక్కయ్యన్, అరుల్ ఒలి ఆనంద రాజ్, బి.మును స్వామి, విశ్వ ప్రసాద్, ఆనంద రావు, ఇలారి దేవదానం పలు జిల్లాలు, కర్ణాటక, కేరళ రాష్ట్రాల ఎమ్మార్పీఎస్ నాయకులు తదితరులు పాల్గొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment