క్లుప్తంగా | - | Sakshi
Sakshi News home page

క్లుప్తంగా

Published Sun, Nov 24 2024 6:12 PM | Last Updated on Sun, Nov 24 2024 6:12 PM

క్లుప

క్లుప్తంగా

మిద్దైపె నుంచి పడి పెయింటర్‌ మృతి

అన్నానగర్‌: మిద్దైపె నుంచి పడి ఓ పెయింటర్‌ మృతిచెందాడు. చైన్నె అన్నానగర్‌లోని కామరాజ్‌నగర్‌, పడికుప్పం రోడ్‌కు చెందిన వీరయ్య (47) పెయింటర్‌. ఇతను శనివారం సెంథిల్‌నగర్‌ సూరబ్‌పట్టు రోడ్డు 4వ వీధిలోని ఓ భవనం మొదటి అంతస్తులో పెయింటింగ్‌ పనిలో నిమగ్నమయ్యాడు. ఆసమయంలో ప్రమాదవశాత్తు అదుపుతప్పి మిద్దైపె నుంచి కిందపడ్డాడు. ఈప్రమాదంలో వీరయ్య అక్కడికక్కడే మృతిచెందాడు. పుళల్‌ పోలీసులు సంఘటన స్థలానికి వెళ్లి మృతదేహాన్ని పోస్ట్‌మార్టం కోసం ఆస్పత్రికి తరలించి కేసు దర్యాప్తు చేస్తున్నారు.

బాలికపై లైంగికదాడి

అన్నానగర్‌: బాలికపై లైంగికదాడికి పాల్పడిన తండ్రిని, బంధువును పోలీసులు అరెస్ట్‌ చేశారు. తిరువొత్తియూర్‌కు చెందిన 35 ఏళ్ల యువకుడు భార్యతో విడిపోయి ఆరేళ్లుగా విడిగా ఉంటున్నాడు. ఇదిలాఉండగా, 8వ తరగతి చదువుతున్న వారి 13 ఏళ్ల కుమార్తె తండ్రి, అమ్మమ్మల వద్ద ఉంటోంది. ఈక్రమంలో బాలిక తండ్రి, అన్నయ్య వరుస గల 19 ఏళ్ల యువకుడు బాలికకు మత్తుమందు ఇచ్చి తరచూ లైంగికదాడికి పాల్పడేవారు. ఈ విషయాన్ని బాలిక తల్లికి చెప్పింది. షాక్‌ తిన్న ఆమె తిరువొత్తియూర్‌ ఆల్‌ మహిళా పోలీస్‌స్టేషన్‌లో శనివారం ఫిర్యాదు చేసింది. పోలీసులు కేసు నమోదు చేసి తండ్రి, యువకుడిని పోక్సో చట్టం కింద అరెస్టు చేసి జైలుకు తరలించారు.

కావేరిలో తేలిన రాకెట్‌ లాంచర్‌

అన్నానగర్‌: తిరుచ్చి సమీపంలోని కావేరి నదిలో శనివారం తేలిన రాకెట్‌ లాంచర్‌ ప్యాడ్‌ ను పోలీసులు స్వాధీనం చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. తిరుచ్చి జిల్లా జియాపురం సమీపం అందనల్లూరు శివాలయం కావేరి నదిలో భక్తులు స్నానాలు చేసేందుకు శనివారం వెళ్లారు. అప్పుడు ఒడ్డున నీటిలో తేలియాడుతున్న రాకెట్‌ లాంచర్‌ చూసి షాక్‌ తిన్నారు. దీంతో వారు జీయపురం పోలీసులకు సమాచారం అందించారు. అనంతరం పోలీసులు వెళ్లి నీటిలో పడి ఉన్న మూడు అడుగుల రాకెట్‌ లాంచర్‌ను స్వాధీనం చేసుకుని మట్టిలో భద్రంగా పూడ్చిపెట్టారు. రాకెట్‌ లాంచర్‌ ఇక్కడికి ఎలా వచ్చింది, ముందుగానే వినియోగించిందా అనే కోణంలోనూ దర్యాప్తు చేస్తున్నారు.

టైరు పేలి లారీని ఢీకొన్న బస్సు

ముగ్గురు దుర్మరణం

20 మందికి తీవ్రగాయాలు

సేలం: టైరు పేలి బస్సు అదుపుతప్పి ఎదురుగా వస్తున్న లారీని ఢీకొన్న ప్రమాదంలో ముగ్గురు దుర్మరణం చెందారు. 20 మంది తీవ్రంగా గాయపడ్డారు. నామక్కల్‌ జిల్లా రాశిపురం–సేలం జిల్లా ఆత్తూర్‌ నుంచి శుక్రవారం రాత్రి రాశిపురానికి 37 మంది ప్రయాణికులతో ఓ ప్రైవేటు బస్సు బయలుదేరింది. రాత్రి నామక్కల్‌ జిల్లా కోరయూర్‌ వద్ద వెళుతుండగా బస్సు టైర్‌ పేలింది. అదుపుతప్పిన బస్సు ఎదురుగా వస్తున్న లారీని ఢీకొంది. ఈప్రమాదంలో లారీ డ్రైవర్‌ అన్నోన్‌ (55), బస్సు డ్రైవర్‌ రవి (56), బస్సులోని ఒక ప్రయాణికురాలు సంఘటన స్థలంలోనే దుర్మరణం చెందారు. తీవ్రంగా గాయపడిన 20 మంది బస్సులోని ప్రయాణికులను రాశిపురం ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. విషయం తెలిసి మంత్రి మదివేందన్‌, నామక్కల్‌ జిల్లా కలెక్టర్‌ ఉమ ఆస్పత్రికి వెళ్లి క్షతగాత్రులను పరామర్శించారు. పోలీసులు కేసు దర్యాప్తు చేస్తున్నారు.

పారిశ్రామిక వేత్త మృతి

సాక్షి, చైన్నె : చైన్నె విమానాశ్రయంలో పశ్చిమ బెంగాల్‌కు చెందిన పారిశ్రామిక వేత్త ఒకరు రక్త వాంతులతో మరణించారు. ఈ ఘటన స్థానికంగా కలకలం రేపింది. వివరాలు.. శనివారం వేకువ జామున కోల్‌కతా నుంచి చైన్నెకు వచ్చిన విమానంలో వీల్‌ చైర్‌ సాయంతో ఓ వ్యక్తిని యువకుడు బయటకు తీసుకొచ్చారు. ఈ సమయంలో హఠాత్తుగా వీల్‌ చైర్‌లో ఉన్న వ్యక్తి రక్త వాంతులు చేసుకోవడంతో విమానాశ్రయ సిబ్బంది అలర్ట్‌ అయ్యారు. అక్కడి హెల్త్‌ సెంటర్‌కు తరలించగా మరణించినట్టు వైద్యులు నిర్ధారించారు. మరణించిన వ్యక్తి పశ్చిమ బెంగాళ్‌లో పారిశ్రామిక వేత్తగా ఉన్న ప్రకాష్‌కుమార్‌ సింఘ్వీ(63)గా తేలింది. వెన్నంటి ఉన్న యువకుడు ఆయన కుమారుడు ఉత్తమ్‌ సింఘ్వీగా గుర్తించారు. గొంతు క్యాన్సర్‌తో బాధ పడుతున్న ప్రకాష్‌కుమార్‌కు చైన్నెలోని ఓ ప్రైవేటు ఆస్పత్రిలో చికిత్స అందిస్తూ వచ్చారు. తరచూ చైన్నెకు వచ్చి చికిత్స పొంది తిరిగి వెళ్తూ వచ్చారు. శనివారం డాక్టర్‌ వద్ద చికిత్స నిమ్తితం వస్తుండగా రక్తపు వాంతులతో విమానాశ్రయంలో ప్రకాష్‌కుమార్‌ మరణించినట్టు విమానాశ్రయ పోలీసుల విచారణలో తేలింది.

No comments yet. Be the first to comment!
Add a comment
క్లుప్తంగా1
1/1

క్లుప్తంగా

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement