పార్లమెంట్‌లో కేంద్రాన్ని నిలదీయండి!
● ఎంపీలకు స్టాలిన్ పిలుపు
సాక్షి, చైన్నె: తమిళనాడు సమస్యలపై, తమిళనాడుకు జరుగుతున్న అన్యాయాలపై కేంద్రాన్ని నిలదీసే విధంగా పార్లమెంట్‌లో స్వరాన్ని పెంచి గళం వినిపించాలని ఎంపీలకు డీఎంకే అధ్యక్షుడు, సీఎం స్టాలిన్ ఆదేశించారు. శుక్రవారం రాత్రి పార్టీ ఎంపీలతో పొద్దు పోయే వరకు స్టాలిన్ డీఎంకే కార్యాలయంలో సమావేశమయ్యారు. పార్లమెంట్ సమావేశాలలో రాష్ట్ర హక్కుల పరిరక్షించేందుకు, తమిళనాడుకు వాటాగా రావాల్సిన నిధులు, ప్రాజెక్టులకు రావాల్సిన నిధులు, ఎయిమ్స్ ఆస్పత్రి ఏర్పాటు తదితర అంశాల గురించి ఇందులోచర్చించారు. కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం రూపంలో తమిళనాడుకు జరుగుతున్న అన్యాయాల గురించి సమీక్షించారు. వివిధ ప్రాజెక్టుల విషయంలో కేంద్రంచూపుతున్న నిర్లక్ష్యంపై చర్చించారు. జీఎస్టీ పన్నుల వాటా, బకాయిలను రాబట్టే దిశగా, పథకాలు, ప్రాజెక్టులకు కేటాయింపు, తదితర అంశాల గురించి పార్లమెంట్‌లో పాలకులను నిలదీయాలని ఈసందర్భంగా ఎంపీలకు స్టాలిన్ సూచించారు. తమిళనాడుకు రైల్వే ప్రాజెక్టులకు కూడా నిధులు ప్రకటించడంలో జరిగిన నిర్లక్ష్యాన్ని ఎత్తి చూపడమే కాకుండా తమిళనాడు ప్రజల తరపున ఉభయ సభలలో స్వరాన్ని పెంచి గళం వినిపించాలని ఆదేశించారు. రాష్ట్రస్థాయి సమస్యలతో పాటుగా వక్ఫ్‌బోర్డు వంటి జాతీయ స్థాయి అంశాలపై కూడా కేంద్రంతో ఢీకొట్టే విధంగా గళం వినిపించాలని పేర్కొన్నారు.
ఎంపీలతో స్టాలిన్ సమావేశం
Comments
Please login to add a commentAdd a comment