క్యాన్సర్‌ను జయిద్దాం!
సాక్షి, చైన్నె : క్యాన్సర్‌ను జయిద్దామని, ఆనందకర క్షణాలు, రోజులను గడుపుదామని సినీ నటుడు హరీష్ కల్యాణ్ పిలుపు నిచ్చారు. క్యాన్సర్‌ను జయించిన వారి సారథ్యంలో జరిగిన క్రికెట్ టోర్నీలో మంగళవారం ఆయన భాగస్వాములయ్యారు. ఆళ్వార్‌పేట కావేరి హాస్పిటల్ నేతృత్వంలో చికిత్స అనంతరం క్యాన్సర్ నుంచి బయట పడ్డ పురుషులకు స్ఫూర్తిదాకమైన క్రికెట్ మ్యాచ్‌ను బౌల్ అవుట్ క్యాన్సర్ 2024 పేరిట స్నేహ పూర్వక మ్యాచ్‌ను నిర్వహించారు. ముఖ్య అతిథిగా విచ్చేసిన నటుడు హరీష్ కళ్యాణ్ క్యాన్సర్ నుంచి బయటపడిన వారితో ఉద్వేగభరితమైన ఘటనలను పంచుకున్నారు వారి ధైర్యాన్ని, సంకల్పాన్ని ప్రశంసించారు. ఈ కార్యక్రమం కేవలం క్రీడా సమ్మేళనం మాత్రమే కాదు అని, క్యాన్సర్‌పై పోరాడి విజయం సాధించిన వారి అపురూపమైన శక్తి అని వ్యాఖ్యలు చేశారు. కావేరి గ్రూప్ హాస్పిటల్ సహ వ్యవస్థాపకుడు డాక్టర్ అరవిందన్ సెల్వరాజ్ మాట్లాడుతూ.. శ్ఙ్రీకేన్సర్ బాధితులు ఇలాంటి సాధికారత కార్యక్రమంలో పాల్గొనడం తమకు ఎంతో ఆనందంగా ఉందన్నారు. వారి ప్రయాణం మానవ స్ఫూర్తికి నిదర్శనంగా పేర్కొన్నారు. కొత్త జీవితాలను పునర్ నిర్మించడంలో తమ వంతు భాగస్వామ్యం మరింత ఆనందాన్ని కలిగిస్తోందన్నారు. మైదానంలో ప్రాణాలతో బయటపడిన వారి ధైర్యాన్ని మరియు ఆనందాన్ని చూడటం ఒక విశేషంగా వ్యాఖ్యలు చేశారు. ఈ కార్యక్రమంలో కావేరి ఆస్పత్రి మెడికల్ డైరెక్టర్ డాక్టర్ అయ్యప్పన్ పొన్నుస్వామి, సూపరింటెండెంట్ మహేశ్‌కుమార్, సీనియర్ సర్జికల్ కన్సల్టెంట్ డాక్టర్ సుజయ్ సుశీక్ పాల్గొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment