వీఐటీలో సౌత్‌జోన్ టేబుల్ టెన్నిస్ టోర్నీ ప్రారంభం
వేలూరు: వేలూరు వీఐటీ యూనివర్సిటీలో సౌత్ జోన్ ఇంటర్ యూనివర్సిటీల టేబుల్ టెన్నిస్ టోర్నమెంట్ మంగళవారం ఉదయం ప్రారంభమైనట్లు వీఐటీ విడుదల చేసిన ఓ ప్రకటనలో తెలిపారు. ఈ టోర్నమెంట్‌ను చాన్స్‌లర్ విశ్వనాథన్ ప్రారంభించగా ముఖ్య అతిథిగా తిరువళ్లువర్ యూనివర్సిటీ వైస్ చాన్స్‌లర్ డాక్టర్ ఆరుముగం పాల్గొన్నారు. ఈ సందర్భంగా చాన్స్‌లర్ మాట్లాడుతూ ప్రతి ఒక్కరి జీవితంలో క్రీడలు ముఖ్య పాత్ర వహిస్తుందన్నారు. క్రీడల్లో పాల్గొనడం వల్ల శారీరక, మానసిక ఉల్లాసంతో పాటు ఆరోగ్యంగా ఉండవచ్చాన్నారు. ప్రస్తుతం ప్రారంభమైన ఈ టోర్నమెంట్‌లో దక్షణ భారత దేశంలోని 103 యూనివర్సిటీల నుంచి క్రీడా కారులు పాల్గొంటారన్నారు. క్రీడాకారులు ఈ పోటీల్లో గెలుపు ఓటమిలను సమానంగా తీసుకోవాలని పట్టుదలతో ప్రయత్నించి గెలుపొందేందుకు ప్రయత్నం చేయాలన్నారు. వీఐటీలో క్రీడలకు అధిక ప్రాధాన్యత ఇస్తున్నామన్నారు. అనంతరం క్రీడా కారులను పరిచయం చేసుకున్నారు. కార్యక్రమంలో వీఐటీ ఉపాద్యక్షులు శంకర్, అసిస్టెంట్ వైస్ చాన్సలర్ కాదంబరి, క్రీడా విభాగం డైరెక్టర్ త్యాగ చందన్, రిజిస్టార్, ఫ్రొఫెసర్‌లు, క్రీడా కారులు పాల్గొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment