తుపాను బాధితులకు సాయం
వేలూరు: రాష్ట్రంలో ఫెంగల్ తుపాను కారణంగా తిరువణ్ణామలై, విల్లుపురం, పుదుచ్చేరి వంటి ప్రాంతాల్లోని ప్రజలు తీవ్రంగా నష్ట పోయారు. దీంతో అక్కడి ప్రజలు జీవానోపాధి లేక తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. దీంతో పలు ప్రాంతాల నుంచి బాధితులను ఆదుకునేందుకు కొందరు సరుకులు అందజేస్తున్నారు. వేలూరు జిల్లాలోని అన్ని శాఖల అధ్వర్యంలో బియ్యం, పప్పు, నూనె వంటి నిత్యవసర వస్తువులతో పాటు దుస్తులు, ఇంటికి అవసరమైన అన్ని వస్తువులను సేకరించారు. ఈ వస్తువులను ప్రభుత్వం అద్వర్యంలో ఆయా జిల్లాలకు పంపించేందుకు మంగళవారం ఉదయం లారీ ద్వారా పంపారు. ఈ లారీని కలెక్టర్ సుబ్బలక్ష్మి జెండా ఊపి ప్రారంభించారు. ఆమెతో పాటు మేయర్ సుజాత, కార్పొరేషన్ కమిషనర్ జానికి, జోన్ చైర్మన్‌లు వెంకటేశన్, నరేంద్రన్, యూసిఫ్‌ఖాన్, తహసీల్దార్ రమేష్, వివిధ శాఖల అధికారులు పాల్గొన్నారు. ప్రస్తుతం పంపిన నిత్యావసర వస్తువుల విలువ సుమారు రూ. 12.44 లక్షలు ఉంటుందని కలెక్టర్ తెలిపారు.
Comments
Please login to add a commentAdd a comment