శింబు, గౌతమ్ మీనన్ కాంబో రిపీట్
తమిళసినిమా: సంచలన నటుడు శింబు దర్శకుడు గౌతమ్ మీనన్ లది సక్సెస్‌ఫుల్ కాంబినేషన్ అన్నది తెలిసిందే. వీరి కాంబినేషన్లో ఇంతకుముందు విన్నైతాండి వరువాయా, ఆ తర్వాత వెందు తనిందదు కాడు వంటి విజయవంతమైన చిత్రాలు రూపొందాయి. కాగా తాజాగా ఈ కాంబినేషన్ అవుతుందని సమాచారం. నటుడు కమలహాసన్ కథానాయకుడుగా మణిరత్నం దర్శకత్వంలో రూపొందుతున్న థక్ లైఫ్ చిత్రంలో నటుడు ధనుష్ ముఖ్యపాత్రను పోషించిన విషయం తెలిసిందే. ఇందులో ఈయనకు జంటగా నటి త్రిష నటించినట్లు సమాచారం.షూటింగ్ పూర్తి చేసుకున్న ఈ చిత్రం వచ్చే ఏడాది సమ్మర్‌లో తనపై రావడానికి ముస్తాబవుతుంది. కాగా ప్రస్తుతం ధనుష్ ఓ మై కడవలే చిత్రం ఫేమ్ అశ్వంత్ మారి ముత్తు దర్శకత్వంలో కథానాయకుడిగా నటించడానికి సిద్ధమవుతున్నారు దీన్ని ఏజీఎస్ ఎంటర్‌టైన్‌మెంట్ సంస్థ నిర్మిస్తోంది. ఇది ఫాంటసీ జానర్లో సాగే ప్రేమ కథా చిత్రంగా ఉంటుందని సమాచారం. కాగా తాజాగా నటుడు శింబు కొత్త చిత్రం గురించి అప్డేట్ సామాజిక మాధ్యమాల్లో వైరల్ అవుతోంది. దీనికి ప్రముఖ దర్శకుడు వెట్రి మారన్ కథా, కథనం, సంభాషణలు సమకూరుస్తున్నట్లు, దర్శకుడు గౌతమ్యానం దీనికి దర్శకత్వం వహించనున్నట్లు తెలిసింది.. ఈ క్రేజీ కాంబినేషన్లో చిత్రాన్ని వేల్స్ ఫిలిం ఇంటర్నేషనల్ పతాకంపై ఐసరి కె. గణేష్ నిర్మించడానికి సన్నాహాలు చేస్తున్నట్లు సమాచారం. ఈయన ఇంతకుముందు శింబు దర్శకుడు గౌతమ్ మీనన్ ల కాంబినేషన్లో దీంతో వెందు తనిందదు కాడు వంటి విజయవంతమైన చిత్రాన్ని నిర్మించారన్నది గమనాభం. దీంతో శింబు అభిమానులు ఫుల్ ఖుషీ అవుతున్నారు. ఈ చిత్రానికి సంబంధించిన అధికారిక ప్రకటన త్వరలో వెలువడే అవకాశం ఉంది.
Comments
Please login to add a commentAdd a comment