గొప్ప నాయకులు ప్రేరేపిస్తారు!
సాక్షి, చైన్నె : గొప్ప నాయకులు కేవలం నాయకత్వం మాత్రమే వహించరని, ప్రజలను సన్మార్గంలో ప్రేరేపిస్తారని సీబీఈ కేసీ వ్యవస్థాపకురాలు, యూకే మాజీ ప్రధాని టోని బ్లేయర్ సతీమని చెరీ బ్లేయర్ వ్యాఖ్యానించారు. చైన్నె పర్యటనకు వచ్చిన చెరీ బ్లేయర్ ఆదివారం స్థానికంగా జరిగిన ఫిక్కీ మహిళా విభాగం కార్యక్రమానికి హాజరయ్యారు. రెండు అంశాలతోకూడిన కార్యక్రమాలను ఆమె ప్రారంభించారు. ఈసందర్భంగా ఆమె మాట్లాడుతూ, ఇలాంటలి కార్యక్రమాలు విశ్వాసాన్ని పెంపొందించడం , స్థిరమైన జీవనోపాధిని సృష్టించడంపై దృష్టి పెడుతాయన్నారు. అట్టడుగు మహిళలకు చిన్న, వడ్డీ లేని రుణాలను అందించడం ద్వారా సూక్ష్మ వ్యాపారాలు చేసుకునే అవకాశం మెరుగు పడుతుందన్నారు. వారి కుటుంబాలను మహిళలే ఆదుకుంటారని, మహిళలు స్వల్పకాలిక రుణ కాలాలను ఉపయోగించమని తాను మరింతగా ప్రోత్సహిస్తానన్నారు. వ్యక్తిగత ఆర్థిక పరిజ్ఞానంతో వృత్తి విద్యా కోర్సులు, పొదుపు వంటి సెషన్స్‌లు మహిళలు తమ రంగంలోకి అడుగుపెట్టినప్పుడు ఆర్థికంగా సంసిద్ధంగా ఉండేలా చేస్తాయన్నారు. కేంద్రీకృత చర్య, మహిళల అపారమైన సామర్థ్యం గురించి వివరిస్తూ మహిళలకు సాధికారత కల్పించడం అనేది స్వచ్ఛంద చర్య కాదని, ఇది తెలివైన పని అని, మూసుకున్న తలుపులను తెరిచనట్టు అని వ్యాఖ్యలు చేశారు. వారి ప్రతిభ, ఆశయం సాధనలో, సాధికారత కోసం ఆచరణాత్మక పరిష్కారాలను అన్వేషించడంలో ముందుంటారన్నారు. అలాగే, ‘గొప్ప నాయకులు కేవలం నాయకత్వం వహించరు అని, ప్రేరేపిస్తారని వ్యాఖ్యలు చేశారు. ఫిక్కీ మహిళా విభాగంచైర్ పర్సన్ దివ్య అభిషేక్ మాట్లాడుతూ, తమ కార్యక్రమానికి చెరీ బ్లెయర్ రావడం ఎంతో ఆనందంగా ఉందన్నారు. మహిళలకు నాయకత్వం వహించడానికి, నేర్చుకోవడానికి, అవకాశాలను అందించడానికి తాము కట్టుబడిఉన్నామన్నారు.
Comments
Please login to add a commentAdd a comment