ఇండియన్ మైఖేల్ జాక్సన్ నృత్య ప్రదర్శన
తమిళ సినిమా: ఇప్పటివరకు పలు సంగీత కచేరాలను చూసి ఆనందించాం. మన ప్రముఖ సంగీత దర్శకులు పలువురు దేశ విదేశాల్లో సంగీత కచేరి నిర్వహించి అశేష సినీ సంగీత ప్రియులను ఆరదింపజేశారు. అయితే మొట్టమొదటిసారిగా నృత్య ప్రదర్శన చైన్నెలో జరగనుంది. అది ఇండియన్ మైఖేల్ జాక్సన్ ప్రభుదేవా నేతృత్వంలో జరగనుండడం విశేషం. గత 50 ఏళ్లుగా నృత్య రంగంలో జాతీయస్థాయిలో మకుటం లేని మహారాజుగా రాణిస్తున్న ప్రభుదేవా నటుడుగానూ, దర్శకుడు గాను తన ప్రతిభను చాటుకుంటున్నారు. అయితే తన తొలి వృత్తి అయిన నృత్య దర్శకత్వాన్ని మాత్రం కొనసాగిస్తూనే ఉన్నారు. కాగా తాజాగా ఈయన ప్రభుదేవా వైబ్‌పేరుతో లైవ్ ఇన్ డానన్స్ కన్సర్ట్ కార్యక్రమం ఫిబ్రవరి 22వ తేదీన చైన్నె, నందనంలోని భయంలో భారీఎత్తున జరగనుంది. అరుణ్ ఈవెంట్స్ సంస్థ నిర్వహిస్తున్న ఈ షోకు ప్రముఖ దర్శకుడు నటుడు దర్శకుడు హరికుమార్ దర్శకత్వం వహిస్తున్నారు. ఈ సందర్భంగా శనివారం సాయంత్రం దీనికి సంబంధించిన మీడియా సమావేశాన్ని చైన్నెలోని ఒక నక్షత్ర హోటల్లో నిర్వహించారు ఇందులో పాల్గొన్న ప్రభుదేవా మాట్లాడుతూ ఇది చాలా మధురమైన క్షణం అన్నారు. తాను ఎప్పుడు ఇలాంటి ఈవెంట్ గురించి ఆలోచించలేదని అరుణ్ ఈవెంట్స్ సంస్థ చేస్తున్న ఈ ప్రయత్నానికి నిత్య దర్శకుడు హరికుమార్ వెన్ను దన్నుగా నిలిచారన్నారు. ప్రేక్షకులు దీన్ని సినిమాగా ఎదురు చూస్తుంటారని, అయితే సినిమాల్లో కట్ చేసి కట్ చేసి డాన్స్ చేస్తుంటామన్నారు. అయితే స్టేజిలో అలా కుదరని కంటిన్యూగా డానన్స్ చేయాలని అన్నారు. అందుకోసం చాలా రోజులుగా రిహార్సల్ చేస్తున్నట్లు చెప్పారు. అందర్నీ ఆనందంపజేయడానికి 200 శాతం శ్రమిస్తున్నట్లు, కచ్చితంగా ఈ డానన్స్ షో అందర్నీ ఆశ్చర్య పరుస్తుందనే అభిప్రాయాన్ని ప్రభుదేవా వ్యక్తం చేశారు. డాక్టర్ ఐశరి గణేష్‌కు చెందిన వేల్స్ ఇంటర్నేషనల్ తదితర సంస్థలు ఈ కార్యక్రమానికి తమ వంతు సహకారాన్ని అందిస్తున్నారు. ఈ కార్యక్రమంలో కొంతమందికి పైగా నృత్య కళాకారులు పాల్గొన్నారని, వారిలో రష్యా కొరియా దేశాలకు చెందిన గాయకులు, నృత్య కళాకారులు కూడా ఉంటారని, దీని 5.1 సౌండ్ సిస్టం లో ఓపెన్ గ్రౌండ్లో నిర్వహిస్తున్నట్లు అరుణ్ ఈవెంట్ నిర్వాహకుడు అరుణ్ పేర్కొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment