క్లుప్తంగా
సంతాన వేణుగోపాలస్వామి చిద్విలాసం
పళ్లిపట్టు: ఆర్కేపేట సమీపంలోని సంతానవేణుగోపాలస్వామి ఆలయంలో శనివారం రాత్రి స్వామి ప్రత్యేక అలంకరణలో గ్రామ వీధుల్లో విహరించి భక్తులకు దర్శనభాగ్యం కల్పించారు. తిరుత్తణి సుబ్రహ్మణ్యస్వామి ఆలయంకు అనుసందానంలోని ఆర్కేపేట సమీపంలోని ఎస్‌వీజీ.పురంలో ప్రసిద్ధి చెందిన శ్రీదేవి, భూదేవి సమేత సంతానవేణుగోపాలస్వామి ఆలయంలో వైకుంఠ ఏకాదశి పర్వదినం సందర్భంగా శనివారం రాత్రి స్వామికి ప్రత్యేక అలంకరణతో మేళ తాళాలు నడుమ గ్రామ వీధుల్లో ఊరేగించారు. గ్రామ మహిళలు కర్పూర హారతులిచ్చి కొబ్బరికాయలు కొట్టి స్వామిని దర్శించుకున్నారు. గ్రామీణులు భక్తులకు ప్రసాదాలు, అన్నదానం పంపిణీ చేశారు. వైకుంఠ ఏకాదశి సందర్భంగా ఆలయం పరిసర ప్రాంతాలు విద్యుదీపాలు పుష్పాలతో సర్వాంగసుందరంగా అలంకరించారు.
బీర్ బాటిల్‌తో పోలీస్‌పై దాడి
తిరువొత్తియూరు: కడలూరు జిల్లాలో మద్యం మత్తులో పోలీస్‌పై బీరు బాటిల్ తో దాడి చేసిన వ్యక్తిపై పోలీసులు కేసు నమోదు చేశారు. కడలూరు, పోలీసు తనిఖీ కేంద్రం వద్ద ఒక వ్యక్తి మద్యం మత్తులో చేతిలో పగిలిన బీరు బాటిల్‌ను పట్టుకొని ప్రజలకు భీతి కలిగించే విధంగా వీరంగం సృష్టిస్తున్నాడు. దీనిపై సమాచారం అందుకున్న పోలీసులు వినాయక మూర్తి, చంద్రశేఖర్ అక్కడికి వెళ్లారు. ఆ వ్యక్తి చేతిలో ఉన్న బీరు బాటిల్‌ను లాక్కోడానికి వినాయక మూర్తి ప్రయత్నించాడు. ఆ సమయంలో ఆ వ్యక్తి బీర్ బాటిల్‌తో వినాయక మూర్తి కడుపులో పొడిచి బెదిరింపులు ఇచ్చాడు. గాయపడిన వినాయక మూర్తిని చికిత్స కోసం కడలూరు ప్రభుత్వ ఆసుపత్రిలో చేర్చారు. అక్కడ వినాయక మూర్తికి కడుపులో 4 కుట్లు వేశారు. ఈ ఘర్షణలో కింద పడిన ఆ వ్యక్తికి గాయాలయ్యాయి. అతన్ని కడలూరు ప్రభుత్వ ఆసుపత్రిలో చికిత్సకు చేర్చారు. ఈ ఘటనలో పోలీస్ పై దాడి చేసిన నెల్లికుప్పం, శరవనాపురం ప్రాంతానికి చెందిన దినేష్ రాజా (32)పై పోలీసులు కేసు నమోదు చేసి విచారణ చేస్తున్నారు.
Comments
Please login to add a commentAdd a comment