విద్యుత్ స్తంభాన్ని ఢీకొన్న లారీ
తిరుత్తణి: తిరుత్తణిలో విద్యుత్ స్తంభాన్ని లారీ ఢీకొన్న ఘటనలో అదృష్టవశాత్తూ పెనుముప్పు తప్పింది. తిరుత్తణి, పళ్లిపట్టు పరిసర ప్రాంతాల్లో 7 రాళ్ల క్వారీలు ఉన్నాయి. ఈ క్వారీల నుంచి ఉదయం 9 గంటల నుంచి సాయంత్రం 6 గంటల వరకు రాళ్లు, గుళకరాళ్లు, ఎం శాండ్ తరలించేందుకు అనుమతి వుంది. అయితే పళ్లిపట్టు, తిరుత్తణి పరసర ప్రాంతాల నుంచి అధిక సంఖ్యలో టారాస్ లారీలు అధిక వేగంతో పయనిస్తుంటాయి. దీంతో వాహన ప్రమాదాలు చోటుచేసుకుంటున్నాయి. ఈక్రమంలో శనివారం రాత్రి 10 గంటల సలలమయంలో సూర్య నగరంలోని క్వారీకి వెళ్లిన లారీ ఎగువ తిరుత్తణి సమీపం పొదటూరుపేట రాష్ట్ర రహదారిలోని పెట్రోల్ బంక్‌కు ఎదురుగా రోడ్డుకు సమీపంలోని విద్యుత్ స్తంభాన్ని లారీ ఢీకొంది. దీంతో విద్యుత్ స్తంభం కూలింది. విద్యుత తీగలు తెగిరోడ్డులో పడ్డాయి. అయితే ఎవరికీ ఎలాంటి ప్రమాదం జరగలేదు.
గుట్కా తరలింపు
కేసులో ఇద్దరు అరెస్ట్
తిరువొత్తియూరు: పలు రాష్ట్రాల నుంచి సైదాపేట మీదుగా చైన్నెకి కొందరు గుట్కా ప్యాకెట్లు, డ్రగ్స్ అక్రమంగా తరలిస్తున్నట్లు శనివారం రాత్రి సెయింట్ థామస్ మౌంట్ డిప్యూటీ కమిషనర్ నేతృత్వంలోని స్పెషల్ పోలీస్ ఫోర్స్‌కు సమాచారం అందింది. దీంతో ఆలందూరు – సైదాపేట బజార్ రోడ్డులో ప్రత్యేక బలగాల పోలీసులు శనివారం రాత్రి వాహనాల తనిఖీలు చేపట్టారు. ఆ సమయంలో అటుగా వేగంగా వస్తున్న కారును ఆపి తనిఖీ చేశారు. అందులో గుట్కాతో పాటు పలు రకాల డ్రగ్స్ అక్రమంగా తరలిస్తున్నట్లు తెలిసింది. దీంతో కారులో వచ్చిన రాజస్థాన్ రాష్ట్రానికి చెందిన బీరుషా( 24), చైన్నె సైదాపేట్‌కు చెందిన సంసురుద్దీన్ (34)ను అరెస్టు చేశారు. వారు పలు రాష్ట్రాల నుంచి గుట్కా ఉత్పత్తులను రైలు, పార్శిళ్ల ద్వారా చైన్నెకి అక్రమంగా తరలించి శివారు ప్రాంతాల్లో విక్రయిస్తున్నట్లు విచారణలో తేలింది. వారి వద్ద నుంచి 400 కిలోల గుట్కాను కారుతో సహా స్వాధీనం చేసుకున్నారు. సెయింట్ థామస్ మౌంట్ పోలీస్ ఇన్‌స్పెక్టర్ బాలన్ కేసు నమోదు చేసి గుట్కా ఉత్పత్తులను అక్రమంగా తరలిస్తున్న బీరుషా, సంసురుద్దీన్ ఇద్దరిని కోర్టులో హాజరుపరచి జైలుకు తరలించారు.
Comments
Please login to add a commentAdd a comment