సాక్షి, హైదరాబాద్: మాజీ మంత్రి, మాజీ హుజూరాబాద్ శాసన సభ్యుడు ఈటల రాజేందర్ మరికొద్ది గంటల్లో కమల తీర్ధం పుచ్చుకోనున్నారు. బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా సమక్షంలో ఆయన రేపు ఉదయం 11:30కి కాషాయ కండువా కప్పుకోనున్నారు. ఇందుకోసం ఆయన రేపు ఉదయం తెలంగాణ అధ్యక్షుడు బండి సంజయ్‌తో కలిసి ప్రత్యేక విమానంలో ఢిల్లీకి వెళ్లనున్నారు. ఈటలతో పాటు మాజీ ఎమ్మెల్యే ఏనుగు రవీందర్‌రెడ్డి, కరీంనగర్ జడ్పీ మాజీ ఛైర్మన్ తుల ఉమ తదితరులు బీజేపీలో చేరనున్నట్లు తెలుస్తోంది. కాగా, దేవరయాంజల్ భూ కుంభకోణంలో ఆరోపణలు ఎదుర్కొంటున్న ఈటెల.. కొద్ది రోజుల కిందటే టీఆర్‌ఎస్‌కు గుడ్ బై చెప్పారు. ఈ క్రమంలో అతను సొంతంగా పార్టీ పెడతారనే ప్రచారం సాగింది. అయితే వీటన్నిటికీ ఫుల్ స్టాప్ పెడుతూ.. ఆయన రేపు ఉదయం బీజేపీలో చేరనున్నారు.
చదవండి: ‘ఈటల కోసం ప్రచారం చేస్తా’
రేపు నడ్డా సమక్షంలో బీజేపీలో చేరనున్న ఈటల
Published Sun, Jun 13 2021 6:33 PM | Last Updated on Sun, Jun 13 2021 8:50 PM
Advertisement
Advertisement
Comments
Please login to add a commentAdd a comment