నోరు జారిన మంత్రి గంగుల.. ఏకంగా సీఎంను మార్చేశారు! | Minister Gangula Kamalakar Tongue Slips Again | Sakshi
Sakshi News home page

నోరు జారిన మంత్రి గంగుల.. ఏకంగా సీఎంను మార్చేశారు!

Published Sat, Jul 10 2021 8:30 PM | Last Updated on Sat, Jul 10 2021 9:13 PM

Minister Gangula Kamalakar Tongue Slips Again - Sakshi

సాక్షి, కరీంనగర్‌ : మంత్రి గంగుల కమలాకర్‌ మరోసారి నోరు జారారు. ఓ సభలో ప్రజలను ఉద్ధేశించి మాట్లాడుతూ చంద్రబాబును తెలంగాణ సీఎంను చేసేశారు. ఆయన్ని దీవించాలని కోరి, నాలిక కరుచుకున్నారు. ఆ వెంటనే తప్పు సరిదిద్దుకున్నారు. మంత్రి గంగుల శనివారం కరీంనగర్ జిల్లాలో పల్లె ప్రగతి కార్యక్రమంలో పాల్గొన్నారు. రూరల్ మండలంలో పర్యటించారు.

ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన ఓ సభలో మాట్లాడుతూ.. ‘‘ కడుపు నిండా భోజనం పెట్టిన వారి కడుపు సల్లగుండాలని దీవిస్తాం గదా! ఇంత మంచి పథకాలు ఇచ్చిన చంద్రబాబుకి కడుపునిండా దీవెనార్థాలు పెట్టాల్నా వద్దా అవ్వా!’’ అని అన్నారు. ఆ వెంటనే నోరు జారిన విషయాన్ని గుర్తించి. ‘‘ కేసీఆర్‌ గారు!... కడుపునిండా కేసీఆర్‌ గారికి ఒకసారి దీవార్థులు పెట్టురి’’ అని సరిదిద్దుకున్నారు.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement