రూ.9వేల మార్కు దాటిన పసుపు ధర!  | Turmeric Price For 100 Kgs Reached 9 Thousand In Telangana | Sakshi
Sakshi News home page

రూ.9వేల మార్కు దాటిన పసుపు ధర! 

Published Tue, Mar 2 2021 1:49 PM | Last Updated on Tue, Mar 2 2021 2:28 PM

Turmeric Price For 100 Kgs Reached 9 Thousand In Telangana - Sakshi

సాక్షి, నిజామాబాద్‌ : నిజామాబాద్‌ వ్యవసాయ మార్కెట్‌ కమిటీలో క్వింటాలు పసుపు ధర రూ.9 వేల మార్కు దాటింది. వేల్పూర్‌ మండలం పడిగెల్‌ గ్రామానికి చెందిన సామ శ్రీనివాస్‌ అనే రైతు సోమవారం తీసుకొచ్చిన 18 క్వింటాళ్ల పసుపుపంటకు ఈ సీజన్‌లో అత్యధికంగా రూ.9389 ధర పలికింది. అలాగే 135 క్వింటాళ్లకు రూ.8500 పైచిలుకు, 481 క్వింటాళ్లకు రూ.8వేలకుపైగా ధర వచ్చిందని మార్కెటింగ్‌శాఖ అధికారులు పేర్కొన్నారు. సోమవారం మార్కెట్‌కు 19,282 క్వింటాళ్ల పసుపు వచ్చింది. గత పదిరోజుల్లోనే క్వింటాలుకు రూ.2 వేల వరకు ధర పెరిగింది. రానున్న రోజుల్లో పసుపు ధర మరింత పెరిగే అవకాశముందని మార్కెట్‌ వర్గాలు భావిస్తున్నాయి. రోజురోజుకూ పచ్చ బంగారం ధర పెరుగుతుండటంతో రైతులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు.

చదవండి: బండరాళ్లు మోది భర్తను చంపిన భార్య

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

 
Advertisement