సుప్రీం తీర్పును స్వాగతిస్తున్నాం
తిరుమల లడ్డూ వివాదంపై సుప్రీంకోర్టు ఆదేశాలను స్వాగతిస్తున్నాం. తెలిపారు. ప్రపంచవ్యాప్తంగా ఉన్న శ్రీవేంకటేశ్వరస్వామి భక్తుల మనోభావాలను దెబ్బతీసిన ముఖ్యమంత్రి చంద్రబాబు, మత విద్వేషాలను రెచ్చగొడుతున్న పవన్‌కల్యాణ్ తక్షణం తమ పదవులకు రాజీనామాలు చేయాలి. సనాతన ధర్మం గురించి మాట్లాడే పవన్ తిరుపతి సభలో మత విద్వేషాలను రెచ్చగొట్టడం దారుణం. ప్రజల్లో మత, కుల విద్వేషాలను రగిల్చే పవన్ ఉప ముఖ్యమంత్రిగా ఉండడానికి ఏమాత్రం అర్హుడు కాదు. చంద్రబాబు, పవన్‌కల్యాణ్ వేంకటేశ్వరస్వామి పట్ల అనుచితంగా ప్రవర్తించడం వల్లే శ్రీవారి బ్రహ్మోత్సవాల వేళ అపశ్రుతి చోటు చేసుకుంది.
– కె.నారాయణస్వామి, మాజీ ఉప ముఖ్యమంత్రి
Comments
Please login to add a commentAdd a comment