మళ్లీ ఉల్లంగనులు!
సాక్షి, టాస్క్‌ఫోర్స్: సైదాపురం మండలంలో మైనింగ్ దందా మళ్లీ మొదలైంది. శనివారం తెల్లవారు జామున రాపూరు సీఐ ఆధ్వర్యంలో సైదాపురంలో ముమ్మరంగా తనిఖీలు చేపట్టారు. ఈ క్రమంలో ఎలాంటి అనుమతులు లేకుండా క్వార్ట్జ్ తరలిస్తున్న లారీని పట్టుకుని ఆదివారం మైనింగ్ అధికారులకు అప్పగించారు. దీంతో ఖనిజ సంపదను అక్రమ తరలింపు గుట్టు రట్టయ్యింది. మండలంలోని పెరుమాళ్లపాడు అంకమ్మబోడు కొండపైన, చుట్టుపక్కల అపారమైన ఖనిజ సంపదను అక్రమార్కులు కొల్లగొట్టి సొమ్ము చేసుకుంటున్న విషయం తేటతెల్లమైంది.ఈ మేరకు చీకటిపడితే పెరుమాళ్లపాడు సమీపం నుంచి రోజూ 2 నుంచి 5 లారీలు తరలితున్నట్టు సమాచారం.
40 గనులకు మాత్రమే అనుమతి
ఉమ్మడి నెల్లూరు జిల్లాలో వెంకటగిరి, సర్వేపల్లి, గూడూరు నియోజకవర్గాల్లో 7 భూగర్భ గనులు, 140 ఓపెన్ క్వార్ట్జ్ గనులున్నాయి. ఇటీవలన అన్ని గనులను ఉన్నతాధికారుల బృందం ప్రత్యేకంగా పర్యవేక్షించింది. ఈ క్రమంలో 80 గనులకు అనుమతులు మంజూరు చేయవచ్చని సూచించింది. ఈ విషయంపై డీఎంజీకి నివేదిక కూడా పంపింది. వాటిలో 40 గనులకు మాత్రమే అధికారులు అనుమతులను మంజూరు చేశారు. డెడ్ రెంట్, లీజులు పొందిన యజమానులకు అనుమతులు ఇవ్వడంలో జాప్యం చేస్తుండడంతో వారంతా ఏకమై అధికారులతో ఢీ అంటే ఢీ అంటున్నారు.
గని యజమానులకు మొండి చెయ్యే!
అసలైన గని యజమానులకు మొండిచెయ్యే మిగిలింది. ఆ ముఖ్యనేత అనుమతులు మంజూరు చేయకపోవడంపై సర్వత్రా విమర్శలు వ్యక్తమవుతున్నాయి. వెంకటగిరి రాజాలకు సైదాపురం మండలంలో మైనింగ్ పరిశ్రమ ఉంది. ఈ పరిశ్రమపై ఆధారపడి వందలాది మంది జీవనం సాగిస్తున్నారు. అలాగే రాధకృష్ణ మైనింగ్ కంపెనీలో కూడా వందలాది మంది ఉపాధి పొందుతున్నారు. ఆ రెండు గనులకు మాత్రం అనుమతులు మంజూరు చేయలేదు. సదరు ముఖ్యనేత అనుమతితో మంజూరైన 40 గనుల్లో ఇప్పటికే ఆ గనులకు ఒక గనికి ముగ్గురు చొప్పున మూడు షిఫ్టుల్లో కుస్తీరాయుళ్లను నియమించారు. దీంతో అనుమతి పొందిన యజమానులు కూడా నివ్వెరపోతున్నారు.
మైకా క్వార్జ్ట్ గని ఇదే
పెరుమాళ్లపాడు అంకమ్మబోడు తిప్ప ఇదే
మొదలైన మైనింగ్ దందా?
క్వార్ట్జ్ లారీని పట్టుకున్న పోలీసులు
అనుమతులు పొందిన 40 గనుల్లో కుస్తీ రాయుళ్లు
షిఫ్టుల వారీగా
అధినేత కనుసన్నల్లో నిఘా
అసలైన మైనింగ్ యజమానులకు దక్కని అనుమతులు
కుస్తీరాయుళ్లతో గస్తీ
అధినేత అనుమతితో మంజూరైన 40 గనుల్లో ఒక్కో గనికి ముగ్గురు చొప్పున కుస్తీరాయుళ్లను నియమించి నిఘా ఉంచారు. ఆ గనుల నుంచి కేవలం మైకా, ఫల్స్‌పర్ ఖనిజం మాత్రమే సంబంధిత యజమానులు తరలించాలి. మైకా క్వార్ట్జ్, క్వార్ట్జ్ ఖనిజం మాత్రం ఆ అధినేతకే ఇవ్వాల్సి ఉంటుంది. ఆ ఖనిజాన్ని తరలించకుండా కట్టుదిట్టంగా అక్కడే కుస్తీరాయుళ్లను తిష్ట వేయించారు.
Comments
Please login to add a commentAdd a comment