నేడు కలెక్టరేట్‌లో ‘గ్రీవెన్స్’
తిరుపతి అర్బన్ : ప్రజా సమస్యల పరిష్కారం కోసం సోమవారం కలెక్టరేట్‌లో గ్రీవెన్స్ డే నిర్వహించనున్నారు. ఉదయం 10 గంటల నుంచి మధ్యాహ్నం ఒంటి గంట వరకు అర్జీలు స్వీకరించనున్నారు. కార్యక్రమానికి కలెక్టర్ వెంకటేశ్వర్‌తోపాటు అన్ని శాఖల ఉన్నతాధికారులు హాజరుకానున్నట్లు కలెక్టరేట్ సిబ్బంది వెల్లడించారు.
పేకాటరాయుళ్ల అరెస్ట్
పాకాల : మండలంలోని మొగరాల పంచాయతీ శేషాపురం సమీపంలోని మామిడి తోటలో ఆదివారం నిర్వహిస్తున్న పేకాట స్థావరంపై దాడి చేసి ఆరుగురిని అదుపులోకి తీసుకున్నట్లు సీఐ సుదర్శన్ ప్రసాద్ తెలిపారు. నిందితులు కేవీ దేవీప్రసాద్, బి.వెంకటేష్, పి.లక్ష్మణ్‌రెడ్డి, కె.భరత్, ఎన్.దేవేంద్ర, కె.మహేంద్రనాయుడు(పాల చిన్న) నుంచి రూ.3,600 నగదు, ఆరు ద్విచక్రవాహనాలు స్వాధీనం చేసుకున్నట్లు వెల్లడించారు. అరెస్ట్ చేసిన వారిని కోర్టులో హాజరుపరచనున్నట్లు వివరించారు. ఈ క్రమంలో మొబైల్ గ్యాంబ్లింగ్‌పై సైతం పోలీసులు దృష్టి సారించాలని పాకాల వాసులు కోరుతున్నారు. ఇటీవల కాలంలో ఆన్‌లైన్ జూదం నిర్వహిస్తూ వందలాది కుటుంబాలను వీధిన పడేస్తున్నవారిపై చర్యలు చేపట్టాలని సూచిస్తున్నారు. మొబైల్ గ్యాంబ్లింగ్‌లో స్థానిక టీడీపీ నేత కీలకపాత్ర పోషిస్తున్నారని ఆరోపిస్తున్నారు.
Comments
Please login to add a commentAdd a comment