విచ్చలవిడిగా ‘చుక్క..ముక్క’!
● యథేచ్ఛగా మాంసం విక్రయాలు ● బ్యాక్‌డోర్‌లో మద్యం అమ్మకాలు ● పట్టించుకోని అధికారులు ● తూతూ మంత్రంగా తనిఖీలు
శ్రీకాళహస్తి/శ్రీకాళహస్తి రూరల్ (రేణిగుంట)/నాగలాపురం : గణతంత్ర దినోత్సవం సందర్భంగా మద్యం, మాంసం విక్రయాలపై ప్రభుత్వం నిషేధం విధించింది. అయినప్పటికీ ఆదివారం శ్రీకాళహస్తి నియోజకవర్గంలో మాత్రం యథేచ్ఛగా మద్యం ఏరులై ప్రవహించింది. విచ్చలవిడిగా మాంసం, చేపల విక్రయాలు సాగాయి. దాబాలు, హోటళ్లలేఓ మాంసాహారం సైతం అమ్మకాలు కొనసాగాయి. ప్రధానంగా అధికార పార్టీ పట్టణ కార్యాలయ సమీపంలో గుట్టుగా మద్యం విక్రయాలు సాగించారు. అలాగే మార్కెట్ వీధి, కొత్త బస్టాండు, మిట్టకండిగ, రాజీవ్ నగర్‌లోని బెల్ట్ దుకాణాలు, అగ్రహారం టర్నింగ్, హాస్పిటల్ రోడ్డులోని బార్‌లలో బ్యాక్ డోర్ అమ్మకాలు సాగించారు. ఇదే అదునుగా కొందరు వైన్‌షాపు యజమానులు అధిక ధరలకు మద్యం విక్రయించి సొమ్ము చేసుకున్నారు. ఎకై ్సజ్ అధికారులు చూసీచూడనట్లు వ్యవహరించడంపై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. ఈ క్రమంలో మున్సిపల్ కమిషనర్ గిరి ఆధ్వర్యంలో సిబ్బంది పట్టణ సమీపంలోని పలు దాబాల్లో తనిఖీలు చేపట్టారు. బైపాస్‌రోడ్డులోని ఓ ప్రైవేట్ కల్యాణమండపం దగ్గ దాబాలో మాంసాహారం సిద్ధం చేస్తుండగా స్వాధీనం చేసుకున్నారు. అయితే స్థానిక కూటమి నేతలు జోక్యం చేసుకోవడంతో ఎలాంటి కేసులు నమోదు చేయకుండా వదిలేసినట్లు తెలిసింది.
రేణిగుంటలో..
రిపబ్లిడే రోజున రేణిగుంటలో విచ్చలవిడిగా మాంసం విక్రయాలు కొనసాగాయి. పోలీసుల హెచ్చరికలను సైతం దుకాణదారులు బేఖాతరు చేశారు. బాలికల జిల్లా పరిషత్ పాఠశాల ఎదురుగా చేపల అమ్మకాలు చేపట్టారు. కొందరు షాపులు మూసేసి, వెనుక వైపు నుంచి చికెన్, మటన్ విక్రయించారు. వైన్‌షాపుల్లో సైతం అధిక ధరలతో మద్యం అమ్మకాలు చేపట్టడం గమనార్హం.
నాగలాపురంలో..
నాగలాపురంలోని బజారు వీధిలో విచ్చలవిడిగా మద్యం, మాంసం విక్రయాలు సాగాయి. అధికారులు పట్టించుకోకపోవడంపై స్థానికులు మండిపడుతున్నారు.
Comments
Please login to add a commentAdd a comment