కానిస్టేబుల్ కుటుంబానికి ఆర్థిక సాయం
తిరుపతి క్రైం : తిరుపతి జిల్లా సాయుధ బలగంలో విధులు నిర్వహిస్తున్న కానిస్టేబుల్ లక్ష్మీపతి ఇటీవల మృతిచెందారు. ఆయన కుటుంబానికి ఆర్థిక సాయం చేయాలని తిరుపతి జిల్లా ఎస్పీ హర్షవర్ధన్ రాజు భావించారు. ఇందులో భాగంగా సోమవారం ఎస్పీ కార్యాలయంలో మృతుడి భార్య సరితకు రూ.లక్ష చెక్కు అందజేశారు.
హత్య కేసులో ఇద్దరికి రిమాండ్
నాగలాపురం: ప్రియుడితో కలిసి భర్తను హతమార్చిన కేసులో ఇద్దరిని రిమాండ్‌కు తరలించినట్లు సీఐ రవీంద్ర తెలిపారు. ఈ మేరకు మీడియా సమావేశంలో ఆయన వివరాలు వెల్లడించారు. ఈనెల 25వ తేదీ పిచ్చాటూరు మండలం, జి.ఎస్.పురం గ్రామానికి చెందిన సుగంధి ఇరుగువాయి గ్రామానికి చెందిన తన ప్రియుడు అరుల్ రాజ్‌తో కలిసి తన భర్త ఆంటోనిని హత్య చేసినట్టు తెలిపారు. హత్యకు కారణమైన వీరిద్దరి మీద గాలింపు చర్యలు చెపట్టగా వీరిద్దరూ నార్యాయణవనం మండలంలోని కై ళాశ కోనలో ఉన్నట్లు పోలీసులకు సమాచారం తెలిసిందన్నారు. ఈ మేరకు ఎస్ఐ, సిబ్బందితో వెళ్ళి సుగంధి(30), అరుల్ రాజ్(35ను అదుపులో తీసుకున్నట్టు పేర్కొన్నారు. హత్యకు ఉపయోగించిన ఉరి తాడు, అరుల్‌రాజ్ మోటార్ సైకిల్‌ను స్వాధీనం చేసుకుని పోలీసు స్టేషన్‌కు తరలించారు. ఇద్దరినీ సోమవారం మీడియా ముందు ప్రవేశపెట్టి సత్యవేడు కోర్టులో హాజరు పరిచి రిమాండుకు తరలించినట్లు సీఐ వెల్లడించారు.
Comments
Please login to add a commentAdd a comment