వేర్వేరు ప్రమాదాల్లో ఇద్దరి దుర్మరణం
చంద్రగిరి/ చిల్లకూరు : జిల్లాలోని వేర్వేరు చోట్ల మంగళవారం జరిగిన రోడ్డు ప్రమాదాల్లో ఇద్దరు మృతి చెందారు. వివరాలు.. చిత్తూరు నుంచి తిరుపతి వైపుగా కోళ్ల లోడుతో వస్తున్న వ్యాను మామండూరు వద్ద జాతీయ రహదారి పక్కన ఆగి ఉన్న లారీని ఢీకొంది. ఈ ప్రమాదంలో రామచంద్రాపురం మండలం కూనేపల్లెకు చెందిన క్లీనర్ వెంకటేష్ మరణించాడు. పోలీసులు ఘటనాస్థలానికి చేరుకుని మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం తిరుపతి ఎస్వీ మెడికల్ కళాశాలకు తరలించారు. వ్యాన్ డ్రైవరు షణ్ముగం అతివేగం కారణంగానే ప్రమాదం జరిగినట్లు పోలీసులు ప్రాథమికంగా నిర్ధారించారు. ఈ మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. అలాగే చిల్లకూరు మండలంలో ముత్యాలపాడు పంచాయతీ రైటారసత్రం వద్ద ఉన్న అపెక్స్ బూట్ల పరిశ్రమలో పని చేసే ఒడిశాకు చెందిన కార్మికుడు కై లాష ప్రదాన్ (48) కారు ఢీకొనడంతో మృతి చెందాడు. మృతదేహాన్ని గూడూరు ఏరియా ఆస్పత్రికి తరలించినట్లు పోలీసులు తెలిపారు.
Comments
Please login to add a commentAdd a comment