వందో ప్రయోగానికి రెడీ!
శోత్రియం భూముల్లో గూడు పుఠాణి!
శోత్రియం భూముల్లో గూడు పుఠాణి రేగుతోంది. షికారీల ముసుగులో కొందరు ఆక్రమణల పరంపర కొనసాగిస్తున్నారు.
నిమ్మ ధర
ఢమాల్
రేపు జీఎస్‌ఎల్‌వీ ఎఫ్–15 రాకెట్ ప్రయోగం
● నేడు ఎంఆర్‌ఆర్, ల్యాబ్ సమావేశం ● నావిక్ సిరీస్‌లో రెండో ఉపగ్రహం
శ్రీవారి దర్శనానికి 6 గంటలు
స్కూళ్లపై పర్యవేక్షణకు క్లస్టర్ విధానం
స్కూళ్లపై పర్యవేక్షణకు నూతనంగా క్లస్టర్ విధానాన్ని తీసుకొస్తున్నట్టు పాఠశాల విద్యాశాఖ డైరెక్టర్ పేర్కొన్నారు.
మంగళవారం శ్రీ 28 శ్రీ జనవరి శ్రీ 2025
వరి ఒబిళ్లు షురూ
క్వింటాకు రూ.2,700 ఇవ్వాలి
ప్రైవేటు వ్యాపారులే క్వింటా వరి రూ.2 వేలు వరకు కొనుగోలు చేస్తున్నారు. అందులో నెమ్ముతోపాటు జల్లు, మట్టి కొంత మేరకు ఉంటాయి. అయినా 75 కిలోల బస్తాకు రూ.1,450 ఇస్తున్నారు. 100 కిలోలు అయితే రూ.1,950 నుంచి రూ.2 వేలు ఇస్తారు. ఇప్పుడు కూటమి ప్రభుత్వం కొనుగోలు చేసే ధాన్యం నెమ్ము, మట్టి, చెత్త ఏమీ లేకుండా అత్యంత శుభ్రంగా ఉండాలి. అలాంటప్పుడు క్వింటాకు రూ.2,700 చొప్పున ఇస్తే రైతుకు గిట్టుబాటు అవుతుంది.
– వీర రాఘవులు, కనమనంబెడు గ్రామం,
బీఎన్‌కండ్రిగ మండలం
ధాన్యం మొత్తం కొనాలి
ప్రైవేటుగా వరి ధాన్యం అమ్మాలంటే ఓ వైపు సరైన ధరలు లేవు. మరోవైపు తూకాల్లో మోసాలు తెలిసిందే. ఈ క్రమంలో క్వింటా ధర కనీసం రూ.2,650కి తక్కువ లేకుండా ఇస్తేనే రైతుకు గిట్టుబాటు ఉంటుంది. మరోవైపు రైతులందరి నుంచి ధాన్యం కొనుగోలు చేయాలని కోరుతున్నాం. కొనుగోలు చేసిన తర్వాత జాప్యం లేకుండా డబ్బులు రైతు ఖాతాల్లో జమచేయాలి.
–రాజశేఖర్,
పెనుమల్లం, ఏర్పేడు మండలం
అందరికీ ఈకేవైసీ చేశాం
వ్యవసాయశాఖ ఆధ్వరంలో 99శాతం పంట ఈ క్రాప్ పూర్తి చేస్తాం. మరోవైపు ఏ రైతు అయితే తమ పంటను విక్రయించాలని భావిస్తున్నారో వారందరి పంటను ఈకేవైసీ చేశాం. ఇక వారు ప్రభుత్వానికి విక్రయిస్తారో.. ప్రయివేటుగా విక్రయిస్తారో వారి ఇష్టం.
–ప్రసాద్‌రావు, జిల్లా వ్యవసాయశాఖ అధికారి
అమ్మవారి ఆలయ
అభివృద్ధికి చర్యలు
చంద్రగిరి: తిరుచానూరు శ్రీ పద్మావతి అమ్మవారి ఆలయ అభివృద్ధికి కార్యాచరణ చేపట్టాలని టీటీడీ ఈఓ శ్యామలరావు అధికారులను ఆదేశించారు. టీటీడీ జేఈఓ వీరబ్రహ్మం, అధికారులతో కలిసి ఆయన సోమవారం ఆలయ పరిసరాలను పరిశీలించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ టీటీడీ విజన్‌లో భాగంగా తిరుచానూరు ఆలయ పరిసరాలలో భక్తులలో మరింత భక్తిభావం, ఆహ్లాదాన్ని పెంచేందుకు ప్రణాళికలు సిద్ధం చేయాలని అధికారులను ఆదేశించారు. ఇంజినీరింగ్, టౌన్ ప్లానింగ్ అధికారులు సమన్వయంతో మరింత ఆకర్షణీయంగా, సౌకర్యవంతంగా ఉండేలా ఆర్కిటెక్చర్ నిపుణుల సహకారంతో మాస్టర్ ప్లాన్‌ను సిద్ధం చేయాలని సూచించారు. తోళప్ప గార్డెన్‌లోని కల్యాణ మండపాలను నిర్మించి ఇప్పటికే 60 ఏళ్లు పూర్తయినట్టు అధికారులు ఈఓకు నివేదించారు. ఆ తర్వాత ఫ్రైడే గార్డెన్‌ను పరిశీలించారు. ఎఫ్‌ఏ అండ్ సీఎఓ బాలాజీ, సీఈ సత్యనారాయణ, డిప్యూటీ ఈఓ గోవిందరాజన్, టౌన్ ప్లానింగ్ ప్రత్యేక అధికారి రాముడు, ఏవీఎస్‌ఓ సతీష్‌కుమార్ పాల్గొన్నారు.
శ్రీవారి సేవలో సినీ నటుడు ఠాకూర్ అనూప్ సింగ్
తిరుమల: తిరుమల శ్రీవారిని సోమవారం సినీ నటుడు ఠాకూర్ అనూప్ సింగ్ దర్శించుకున్నారు. ఆయనకు ఆలయ అధికారులు ప్రత్యేక దర్శనం ఏర్పాట్లు చేశారు. అనంతరం ఆలయ రంగనాయకుల మండపంలో పండితులు వేద ఆశీర్వచనం అందించగా.. టీటీడీ అధికారులు లడ్డు ప్రసాదాలతో సత్కరించారు.
ఆత్మస్థైర్యంతో రాణించాలి
తిరుపతి సిటీ: సవాళ్లకు ఎదురొడ్డి ఆత్మస్థైర్యంతో రాణిస్తే లక్ష్యం సులభతరమవుతుందని వీసీ ప్రొఫెసర్ వీ.ఉమ పేర్కొన్నారు. సోమవారం మహిళా వర్సిటీ సోషల్ వర్క్ విభాగం, యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా సంయుక్త ఆధ్వర్యంలో ఉమెన్ ఇన్ కాన్టెంపరరీ సోషల్ రీమ్ ఎమర్జింగ్ స్టేటజీస్ అనే అంశంపై రెండు రోజుల పాటు జరిగే జాతీయ సదస్సుకు ఆమె ముఖ్యఅతిథిగా విచ్చేసి ప్రారంభించి ప్రసంగించారు. ప్రాచీన కాలం నుంచి నేటి వరకు సమాజంలో సీ్త్ర సాధికారత సాధనలో సమస్యలు, సవాళ్లు ఉన్నాయని, వాటిని అవకాశాలుగా మలచుకుని మహిళలు అన్ని రంగాలలో రాణించాల్సి ఉందన్నారు. అనంతరం ఎస్వీయూ న్యూట్రీషియన్ విభాగం ప్రొఫెసర్ కేవీ సుచరి మాట్లాడుతూ పట్టుదలతో రాణిస్తే సీ్త్ర సాధించలేనిది ఏమీ లేదన్నారు. సదస్సులో సోషల్ వర్క్ విభాగం హెచ్‌ఓడీ ప్రొఫెసర్ తవిత తులసి, యూనియన్ బ్యాంక్ సిబ్బంది, దేశం నలుమూల నుంచి విద్యావేత్తలు, పరిశోధకులు, అధ్యాపకులు పాల్గొన్నారు.
వరి ధాన్యం కొనుగోలులోనూ కూటమి ప్రభుత్వం రైతుల సహనాన్ని పరీక్షిస్తోంది. అరకొర ధాన్యం కొనుగోలు చేసి మిగిలిన మొత్తాన్ని దళారులకు దోచిపెట్టేందుకు సిద్ధమైంది. సాగు విస్తీర్ణాన్ని బట్టి.. దిగుబడిని అంచనా వేసి ధాన్యం కొనుగోలు చేయాల్సింది పోయి ఈ ఏడాది 20 టన్నులు మాత్రమే కొనుగోలు చేయాలని మెలిక పెట్టడం విమర్శలకు తావిస్తోంది. గిట్టుబాటు ధరతో ధాన్యం మొత్తం కొనుగోలు చేయాలని రైతాంగం డిమాండ్ చేస్తోంది.
తిరుపతి అర్బన్: జిల్లాలో ధాన్యం కొనుగోలుకు కూటమి ప్రభుత్వం గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. గతంలో మాదిరిగానే రైతు భరోసా కేంద్రాల్లో ధాన్యం కొనుగోలు చేయనుంది. పంట సాగుకు సంబంధించి ఈకేవైసీ చేయించుకున్న రైతుల వద్దనే ధాన్యం కొనుగోలు చేసేందుకు అధికార యంత్రాంగం సిద్ధమైంది. మార్చి 31వ తేదీ వరకు వరి ధాన్యం కొనుగోలు చేస్తామని సంబంధిత సివిల్ సప్లయ్ అధికారులు పేర్కొంటున్నారు.
మార్చి 31 వరకు కొనుగోలు
మార్చి 31 వరకు మాత్రమే వరి ధాన్యం కొనుగోలు చేస్తామని సివిల్ సప్లయ్ అధికారులు సంకేతాలు ఇస్తున్నారు. సాధారణంగా జనవరి చివరి నుంచి వరి ఒబ్బిళ్లు మొదలు పెడుతారు. మే 31 వరకు ఇవి కొనసాగుతాయి. అయితే మార్చి 31 వరకు కొంటే ఆ తర్వాత వచ్చే ధాన్యం ఎవరికి విక్రయించాలని రైతాంగం ప్రశ్నిస్తోంది.
8 రకాలు మాత్రమే కొనుగోలు
జిల్లాలో 20 రకాల వరి వంగడాలు సాగు చేశారు. అయితే ఎన్‌ఎల్‌ఆర్ 3892, 34449 రకాలు, కేఎన్‌ఎం 1638, 733 రకాలు, ఆర్‌ఎన్‌ఆర్ 15048 రకాలు, బీపీటీ 5204, 2782 రకాలు, ఎంటీయూ 1156, 1271, 1224, 1010 రకాలు మాత్రమే అధికారులు కొనుగోలు చేయనున్నారు. మిగిలిన రకాలకు నో చాన్స్.
కొనుగోలు చేయకపోవడంతో రోడ్లపైనే వరి ధాన్యం
షార్‌లోని రెండో ప్రయోగ వేదికపై
విద్యుత్ కాంతులతో మెరిసిపోతున్న
జీఎస్‌ఎల్‌వీ ఎఫ్15 ఉపగ్రహ వాహకనౌక
● కిలో రూ.30 నుంచి రూ.40 వరకే
చిల్లకూరు: నిమ్మ ధరలు పడిపోయాయి. దీంతో రైతులు దిక్కుతోచని స్థితిలో పడిపోయారు. దేశ రాజధాని ఢిల్లీ మార్కెట్టుకు పలు ప్రాంతాల నుంచి నిమ్మకాయాలు ఎగుమతి అవుతుంటాయి. కానీ అక్కడి వ్యాపారులు, కొనుగోలుదారులు ఎక్కువగా గూడూరు ప్రాంతంలోని నిమ్మ కాయలనే కొనుగోలు చేస్తుంటారు. ఇక్కడి వ్యాపారులు కూడా ఢిల్లీ మార్కెట్టుపైనే ఎక్కువగా ఆధారపడుతుంటారు. అయితే ఇటీవల నిమ్మ మార్కెట్‌లో వ్యాపారులు సిండికేట్‌గా ఏర్పడ్డారు. బయట ప్రాంతాల నుంచి తక్కువ ధరలకు నిమ్మ కాయలను దిగుమతి చేసుకుంటున్నారు. గూడూరు నిమ్మ పేరుతో వాటిని ఎగుమతి చేసి లాభాలు ఆర్జిస్తున్నారు. ఈ క్రమంలో వ్యాపారుస్తులు నిర్ణయించిన ధరలకే నిమ్మను విక్రయించుకోవాల్సి వస్తోందని రైతులు ఆవేదన చెందుతున్నారు.
సూళ్లూరుపేట: సతీష్ ధవన్ స్పేస్ సెంటర్ షార్‌లోని రెండో ప్రయోగ వేదిక నుంచి ఈనెల 29వ తేదీ వందో ప్రయోగానికి అంతా సిద్ధం చేశారు. జీఎస్‌ఎల్‌వీ ఎఫ్–15 రాకెట్ ద్వారా 2,250 కిలోల బరువు కలిగిన నావిక్–02 ఉపగ్రహాన్ని కక్ష్యలోకి పంపేందుకు సన్నాహాలు పూర్తిచేశారు. షార్‌లోని మొదటి వెహికల్ అసెంబ్లింగ్ బిల్డింగ్ (వ్యాబ్)లో మూడు దశల రాకెట్ అనుసంధానాన్ని పూర్తిచేసి ఉంబ్లికల్ టవర్ (ప్రయోగవేదిక)కు అనుసంధానించారు. సోమవారం మిషన్ రెడీనెస్ రివ్యూ సమావేశం నిర్వహించారు. రాకెట్‌ను సిద్ధంచేసి ప్రయోగ పనులను లాంచ్ ఆథరైజేషన్ బోర్డు (ల్యాబ్)కు అప్పగించారు.
బుధవారం ఉదయం 6.23కు ప్రయోగం
లాంగ్ ఆథరైజేషన్ బోర్డు వారు లాంచ్ రిహార్సల్స్ నిర్వహించి మంగళవారం తెల్లవారు జామున 2.53 కౌంట్‌డౌన్, బుధవారం ఉదయం 6.23 గంటలకు ప్రయోగాన్ని నిర్వహించనున్నట్టు ప్రకటించారు. జీఎస్‌ఎల్‌వీ ఎప్15 రాకెట్ ప్రయోగ సమయంలో 420.7 టన్నుల బరువుతో భూమి నుంచి నింగికి బయలుదేరనుంది. 2,250 కిలోలు బరువు కలిగిన నావిక్–02 ఉపగ్రహాన్ని రోదసీలోకి పంపనున్నారు. ఈ ప్రయోగాన్ని 19.17 నిమిషాల్లో పూర్తి చేయనున్నారు. జీఎస్‌ఎల్‌వీ ఎఫ్–15 ప్రయోగం వందో ప్రయోగం. పూర్తి స్వదేశీ సాంకేతిక పరిజ్ఞానంతో రూపొందించిన క్రయోజనిక్ ఇంజిన్‌లతో 11వ ప్రయోగం. ఇస్రో చైర్మన్‌గా డాక్టర్ వీ నారాయణన్ బాధ్యతలు చేపట్టాక మొదటి ప్రయోగం కావడం విశేషం.
తిరుమల: తిరుమలలో భక్తుల రద్దీ సాధారణంగా ఉంది. క్యూకాంప్లెక్స్‌లో 2 కంపార్ట్‌మెంట్లు ఖాళీగా ఉన్నాయి. ఆదివారం అర్ధరాత్రి వరకు 74,466 మంది స్వామివారిని దర్శించుకున్నారు. 26,677 మంది భక్తులు తలనీలాలు సమర్పించారు. స్వామివారికి కానుకల రూపంలో హుండీలో రూ.3.67 కోట్లు సమర్పించారు. టైంస్లాట్ టిక్కెట్లు కలిగిన భక్తులకు సకాలంలోనే దర్శనమవుతోంది. దర్శన టిక్కెట్లు లేని వారికి 6 గంటలు పడుతోంది. ప్రత్యేక ప్రవేశ దర్శనం టిక్కెట్లు కలిగిన భక్తులకు 3 గంటల్లో దర్శనం లభిస్తోంది. ఇదిలా ఉండగా సర్వదర్శనం టోకెన్లు కలిగిన భక్తులు నిర్దేశించిన సమయానికి క్యూలైన్లోకి వెళ్లాలని టీటీడీ విజ్ఞప్తి చేసింది. ముందుగా వెళ్లిన వారిని లోనికి అనుమతించబోమని స్పష్టం చేసింది.
– 8లో
– 8లో
– 8లో
న్యూస్‌రీల్
ధాన్యం కొనుగోలుకు ప్రభుత్వం గ్రీన్ సిగ్నల్
జిల్లాలో 2.2 లక్షల ఎకరాల్లో
వరి పంట సాగు
ఈ సారి 6 లక్షల టన్నుల వరకు
దిగుబడికి అవకాశం
అయితే 20 వేల టన్నుల కొనుగోలకు మాత్రమే అనుమతి
మిగిలిన 5.8 లక్షల టన్నుల మాటేంటో?
దళారులకు కొమ్ముకాస్తున్న
కూటమి ప్రభుత్వం
విమర్శలు ఎక్కుపెడుతున్న రైతాంగం
ఆ ధాన్యం సంగతేంటో?
జిల్లా వ్యాప్తంగా 2.2 లక్షల ఎకరాల్లో వరి పంట సాగవగా.. ఎకరాకు 3 టన్నుల వరకు దిగుబడి వచ్చే అవకాశం ఉంది. ఈ లెక్కన మొత్తం 6,00,060 టన్నుల వరకు దిగుబడి వస్తుందని అంచనా. అయితే కూటమి ప్రభుత్వం 20 వేల టన్నుల వరి ధాన్యం కొనుగోలు చేయాలని ఆదేశాలు జారీ చేసినట్లు తెలుస్తోంది. మిగిలిన 5.8 లక్షల టన్నుల వరి ధాన్యం మాటేంటో తెలియడం లేదు. దీనిపై రైతులు విరుచుకుపడుతున్నారు. అరకొర ధాన్యం కొనోగులు చేయడం ఏంటని మండిపడుతున్నారు. ఈ సారీ దళారులపైనే ఆధారపడాల్సి వస్తుందేమోనని ఆందోళన చెందుతోంది. ఇందిలావుండగా ఏటా శ్రీకాళహస్తిలోని ఏపీసీడ్స్ వారు ముందుగా వరి విత్తనాలు ఇచ్చి.. తిరిగి 80 టన్నుల వరి ధాన్యం కొనుగోలు చేస్తుంటారు. అయినప్పటికి 5 లక్షల టన్నుల వరి ధాన్యం మిగులుతుంది. ఈ ధాన్యం దళారుల నేతృత్వంలో ప్రైవేటు వ్యాపారులకు తక్కువ ధరలకే విక్రయించాల్సి వస్తోంది. ఈ సారి సాగు విస్తీర్ణం పెరగడం.. తక్కువ మొత్తంలోనే ధాన్యం కొనుగోలు చేయాలని ఆదేశాలు జారీ చేసిన నేపథ్యంలో దళారులు రాజ్యమేలడం ఖాయంగా కనిపిస్తోంది.
అంతా గోప్యమే
వరి ధాన్యం కొనుగోలు చేయడంలో అధికారులు అంతా గోప్యంగానే ఉంచుతున్నారు. పబ్లిసిటీ అయితే ఆ స్థాయిలో కొనుగోలు చేయడానికి అవకాశం లేదని సైలెట్‌గా కొనుగోలు చేయడానికి సన్నాహాలు చేస్తున్నారు. ముందుగా సర్కార్ ఈ రేట్లుకు వరి ధాన్యం కొనుగోలు చేస్తుందని స్పష్టంగా చెప్పలేకపోతున్నారు. ఎందుకుంటే 6 లక్షల టన్నుల ధాన్యం కొనుగోలు చేయలేమని ఇప్పుడే చేతులెత్తేస్తున్నారు.
రెండు మూడు రోజుల్లో కొనుగోలు
రెండు మూడు రోజుల్లో వరి ధాన్యం కొనుగోలు ప్రక్రియను ప్రారంభిస్తాం. వరదయ్యపాళెం మండలంలో ఓ రైతు నుంచి ట్రయల్ రన్ ప్రక్రియను చేపట్టాం. 20 వేల టన్నులు కొనుగోలు చేయమని ఉత్తర్వులు వచ్చాయి. ఆ తర్వాత స్థానిక పరిస్థితులను బట్టి కొనుగోలు చేస్తాం.
– వై.సుమతి, జిల్లా సివిల్ సప్లయ్ మేనేజర్
పెంచని ధర
రెండేళ్ల క్రితం వైఎస్సార్‌సీపీ ప్రభుత్వం గ్రేడ్–ఏ రకం వరి ధాన్యం టన్ను రూ.2,320, సాధారణ రకం రూ.2,300కు కొనుగోలు చేసింది. అయితే కూటమి ప్రభుత్వం కూడా అదే ధరకు ధాన్యం కొనుగోలు చేయాలని నిర్ణయించింది. ప్రతి ఏటా టన్నుకు రూ.200 పెంచాల్సి ఉంది. ఈ లెక్కన రెండేళ్లకు టన్నుపై రూ.400 పెంచాల్సి ఉన్నా ఆ దిశగా చర్యలు చేపట్టకపోవడం విమర్శలకు తావిస్తోంది.
తల్ల‘ఢిల్లి’పోతోంది!
గత ఏడాది ఇదే జనవరిలో కిలో నిమ్మకాయలు రూ.70 వరకు పలికాయి. అయితే ఈ ఏడాది జనవరి నుంచి ఒడిదుడుకుల మధ్య కిలో రూ.30 నుంచి రూ.40 మధ్య మాత్రమే పలుకుతోంది. ప్రస్తుతం ఢిల్లీలో ఒక వైపు ఎన్నికల జోరు, మంచు విపరీతంగా కురుస్తుండడంతో అక్కడకు తక్కువగా ఎగుమతులు జరుగుతున్నాయి. రైతులు నిమ్మ కాయలు వచ్చే సమయంలో ఇలా ధరలు పడి పోతే నష్టాలు చవిచూడాల్సిందేనని పలువురు ఆవేదన చెందుతున్నారు.
Comments
Please login to add a commentAdd a comment