● కార్తీక శోభ
● భక్తిశ్రద్ధలతో చక్రతీర్థం
కార్తీకమాసం చివరి సోమవారాన్ని పురస్కరించుకుని కుల్కచర్ల మండలం బండవెల్కిచర్ల పాంబండ రామలింగేశ్వర స్వామికి లక్ష బిల్వార్చన సేవ నిర్వహించారు. ఈ వేడుకలో భక్తులు పెద్దసంఖ్యలో పాల్గొన్నారు. పూజా కార్యక్రమాన్ని ఆలయ ఈఓ సుధాకర్, అర్చకులు పాండుశర్మ దగ్గరుండిపర్యవేక్షించారు.
– కుల్కచర్ల
అనంతగిరి గుట్టలో వెలసిన అనంతపద్మనాభ స్వామి పెద్ద జాతర సోమవారం జరిగిన చక్రతీర్థంతో ముగిశాయి. వేకువజామున స్వామివారికి సుప్రభాత సేవ, ప్రత్యేక అలంకరణ, అర్చనలు, అభిషేకాలు చేశారు. అనంతరం ఉత్సవ విగ్రహాలను ఊరేగింపుగా పుష్కరిణి వద్దకు తీసుకెళ్లారు. అక్కడ వేదపండితుల మంత్రోచ్ఛారణ మధ్య చక్రతీర్థం వేడుక నిర్వహించారు. వేడుకల్లో ఆలయ ఈవో నరేందర్, ధర్మకర్త పద్మనాభం తదితరులు పాల్గొన్నారు. అనంతరం స్వామివారికి భక్తులు సమర్పించిన కోడెలకు వేలం నిర్వహించారు. దీని ద్వారా ఆలయానికి రూ. 69,700 ఆదాయం వచ్చినట్లు ఈవో నరేందర్ తెలిపారు.
– అనంతగిరి
Comments
Please login to add a commentAdd a comment