వేసెక్టమీపై అవగాహన కల్పించాలి
అనంతగిరి: కుటుంబ నియంత్రణ గురించి భార్యభర్తలు మాట్లాడుకోవడం ఈ రోజు నుంచే ప్రారంభించాలని జిల్లా వైద్యాధికారి డాక్టర్ వై.వెంకటరవణ అన్నారు. వేసెక్టమీ పక్షోత్సవాలను పురస్కరించుకుని సోమవారం వికారాబాద్‌లోని డీఎంహెచ్ఓ కార్యాలయంలో పీహెచ్‌సీల వైద్యాధికారులతో సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ప్రజలకు వేసెక్టమీ అవగాహన కల్పించాలన్నారు. ఈ ఆపరేషన్‌పై ప్రజల్లో ఉన్న అపోహలను తొలగించాలని సూచించారు. నవంబర్ 28 నుంచి డిసెంబర్ 4వ తేదీ వరకు వికారాబాద్ జిల్లా ఆస్పత్రిలో వేసెక్టమీ ఆపరేషన్లు చేయించాలన్నారు. వచ్చే వారం నుంచి ట్యూబెక్టమి ఆపరేషన్లు చేయడానికి ఏర్పాట్లు చేస్తున్నట్లు తెలిపారు. కార్యక్రమంలో ఎంసీహెచ్ ప్రోగ్రాం ఆఫీసర్ డాక్టర్ పవిత్ర, నేహ, నాగమల్లేశ్వరరావు, శ్రీనివాసులు, రజిత, పీహెచ్సీ వైద్యులు పాల్గొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment