నెల ఎగుమతి(కిలోల్లో) దిగుమతి(కిలోల్లో) జనవరిలో 40,596 20,527 ఫిబ్రవరిలో 1,20,507 26,789 మార్చిలో 1,68,738 20,020 ఏప్రిల్‌లో 1,65,622 19,764
ఉత్తరాంధ్ర ష్రింప్‌కు మంచి డిమాండ్ లభిస్తోంది. రోజు రోజుకీ ఎగుమతుల్లో వృద్ధి కనిపిస్తోంది. ముఖ్యంగా ఇక్కడ దొరికే వనామీ రొయ్య పిల్లలకు వివిధ రాష్ట్రాలు, దేశాల్లో ఎక్కువ డిమాండ్ ఉంది. వ్యాపారులు కొనుగోళ్లని క్రమంగా పెంచారు. వైజాగ్ ఎయిర్‌పోర్టులో జరిగే ఎగుమతుల్లో సింహభాగం వరకూ మైరెన్ ఉత్పత్తులే ఉండగా ఇందులో 85 శాతం వరకూ రొయ్య పిల్లలే ఉంటాయి. డిమాండ్ ఎక్కువగా ఉన్న టైమ్‌లో ష్రింప్ కార్గో కోసం విమానంలో పాసింజర్స్ స్థానంలో సీట్లపై ఎలాంటి లీకేజీలు లేకుండా ప్యాక్ చేసి ఆన్‌సీట్‌లో ఎగుమతులు చేస్తున్నాం. రాష్ట్రంలో రొయ్య పిల్లల ఎగుమతుల్లో 80 శాతం వరకూ వైజాగ్‌లో జరుగుతుండగా 20 శాతం విజయవాడ, రాజమండ్రిలో జరుగుతున్నాయి. త్వరితగతిన రొయ్య పిల్లలు ఆయా ప్రాంతాలకు చేరుకోవడం వల్ల వ్యాపారులకు రెవెన్యూ పెరుగుతోంది. కొత్తగా వచ్చిన వ్యాపారులు కార్గో అవకాశాల్ని అందిపుచ్చుకోవాలి. – రాజారెడ్డి, ఎయిర్‌పోర్టు డైరెక్టర్
Comments
Please login to add a commentAdd a comment